హెచ్3ఎన్2 అంటే ఏమిటి..? లక్షణాలు ఎలా ఉంటాయి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : హెచ్3ఎన్2 అనేది ఇన్ఫ్లూయెంజా ఏ ఒక రకం వైరస్. దీనిని 'హాంగ్ కాంగ్ ఫ్లూ' అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా ప్రతి ఏటా సీజనల్ ఫ్లూనకు కారణమవుతుంది. గతంలో కూడా ఈ వైరస్ కేసులు ప్రపంచదేశాల్లో సైతం నమోదయ్యాయి, కానీ ఈసారి అధిక సంఖ్యలో కేసులు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు.

హెచ్3ఎన్2 లక్షణాలు ఎలా ఉంటాయి..?

తీవ్రమైన జ్వరం 

దగ్గు

గొంతు నొప్పి

ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు

అలసట

తలనొప్పి

ముక్కు కారడం

కొన్నిసార్లు వికారం, వాంతులు, అతిసారం (ముఖ్యంగా పిల్లలలో) ఈ లక్షణాలు సాధారణంగా వైరస్ సోకిన 1-4 రోజుల్లో కనిపిస్తాయి. జ్వరం 3 రోజుల్లో తగ్గినప్పటికీ, దగ్గు మాత్రం 2-3 వారాల వరకు కొనసాగే అవకాశం ఉంది.

 ఇది కూడా చదవండి.. పిల్లల్లో ఈ 5 లక్షణాలు కనిపిస్తే విటమిన్-డి లోపమే..!

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.