పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటే..? 

షేర్ చేయండి:
పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటే..? 

సాక్షి లైఫ్ : సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడంతో పాటు జీవనశైలిలో నేడు వచ్చిన మార్పుల కారణంగా చాలామంది చెడు కొలెస్ట్రాల్ సమస్యకు గురవుతున్నారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుదల గుండెకు హాని కలిగిస్తుంది. అంతేకాకుండా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ కాళ్లకు కూడా హాని చేస్తుందని తెలుసా..? 

ఇది కూడా చదవండి.. పానీపూరీ తయారీలో కృత్రిమ రంగులపై నిషేధం..

రక్త ప్రసరణ.. 


కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కాళ్లలో రక్త ప్రసరణ సరిగా జరగదు. దీని కారణంగా, నొప్పి చాలా కాలం పాటు వస్తూవుంటుంది. అయినప్పటికీ చాలా మందికి దీని గురించి తెలియదు. కొందరు ఈ నొప్పిని శరీరంలో కాల్షియం లేదా రక్తం సరిగా లేకపోవడంగా కారణంగా వస్తుందని భావిస్తారు. ఒకవేళ మీకు కూడా కాళ్లలో నొప్పి ఉంటే, మీరు మీ కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. భారతదేశంలో 25-30శాతంమందికి అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంది. కానీ వారిలో సగం కంటే ఎక్కువ మందికి దాని గురించి తెలియదు.

పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి అంటే ఏమిటి..?

కాళ్లు నొప్పిగా అనిపిస్తే అది చెడు కొలెస్ట్రాల్ వల్ల కావచ్చు. ఈ సమస్యను పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వల్ల కాళ్లు నొప్పులు వస్తాయని, కొందరిలో బిగుతు సమస్య కూడా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఏదైనా శారీరక శ్రమ చేస్తుంటే ఈ నొప్పి పెరుగుతుంది. పెరిగిన కొలెస్ట్రాల్ రక్త సిరల్లో పేరుకుపోవడం వల్ల ఇది జరుగుతుంది. దీనివల్ల కాళ్లకు రక్తప్రసరణ సరిగా జరగదు. రక్త ప్రసరణ తగ్గినప్పుడు, అది కాళ్ళపై కూడా ప్రభావం చూపుతుంది. దీనికారణంగా నొప్పి మొదలవుతుంది. ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత సమస్య పెరుగుతుంది.

వైద్యుడిని సంప్రదించండి..

చాలా కాలంగా కాళ్లలో నొప్పి ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఊబకాయం సమస్య ఉన్నవారు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొలెస్ట్రాల్‌ను తనిఖీ చేయడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షలో కొలెస్ట్రాల్ పెరిగితే, ఆహారంలో మార్పులు ,మందులు కూడా ఇస్తారు. 

 చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..?  

ఛాతి నొప్పి

శ్వాసకోస సమస్య

అలసిపోతున్నట్లుగా అనిపిస్తుంది

వికారం

కొలెస్ట్రాల్‌ను ఎలా నియంత్రించాలి..? 

రోజువారీ వ్యాయామం

ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి..

మద్యపానం, సిగరెట్ అలవాట్లు వదిలేయాలి..  

ప్రతి 6 నెలలకొకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి.  
వైద్యులు అందించిన చికిత్స తీసుకోవాలి. 

ఇది కూడా చదవండి..షవర్మాలో బ్యాక్టీరియా.. తయారీదారులపై చట్టపరమైన చర్యలు.. 

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.