సాక్షి లైఫ్ : పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ డీ, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా చేయడంలో సహాయపడతాయి. అందుకే ప్రతిరోజు పాలు తాగాలని సూచిస్తుంటారు పోషకాహార నిపుణులు. అయితే, ఇక్కడే ఓ సమస్య! మన ఆరోగ్యానికి ఆవు పాలు మంచివా? బర్రె పాలు మంచివా..? ఇది చాలామందిలో వచ్చే సందేహమే. అసలు ఆవు పాలకు, బర్రె పాలకు మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం..
ఆవు పాలతో పోలిస్తే..
పాలల్లో ఉండే కొవ్వుపై వాటి చిక్కదనం ఆధారపడి ఉంటుంది. ఆవు పాలల్లో 3-4 శాతం మాత్రమే కొవ్వు ఉంటుంది. అదే బర్రె పాలల్లో 7-8 శాతం వరకు కొవ్వు ఉంటుంది. అందుకే ఆవు పాల కంటే బర్రె పాలు చిక్కగా ఉంటాయి. దీనివల్ల బర్రెపాలు అరగడానికి కాస్త సమయం పడుతుంది. ఆవు పాలతో పోలిస్తే బర్రె పాలల్లో 10-11 శాతం ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి ఎక్కువగా వేడి నిరోధకతను కలిగి ఉంటాయి. అందుకే నవజాత శిశువులు, వృద్ధులకు బర్రె పాలు తాగించొద్దని చెబుతుంటారు.
బర్రె పాలల్లో..
ఆవు పాలతో పోలిస్తే బర్రె పాలల్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఊబకాయం, రక్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడేవారు ఆవు పాలకు బదులు బర్రె పాలు తాగడం మంచిది. ఆవుపాలతో పోలిస్తే బర్రె పాలల్లోనే కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కేలరీలతో పాటు ప్రోటీన్లు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఒక గ్లాస్ బర్రె పాలల్లో 237 కేలరీలు ఉంటే.. ఒక గ్లాస్ ఆవు పాలల్లో 148 కేలరీలు మాత్రమే ఉంటాయి. బర్రె పాలల్లో పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆవు పాలతో పోలిస్తే బర్రె పాలు ఎక్కువ సమయం నిల్వ ఉంటాయి. ఆవు పాలను రెండు రోజులలోపే తాగాలి.
బీటాకెరోటిన్..
ఆవు పాలు పసుపు, తెలుపు రంగులో ఉంటాయి. అదే బర్రె పాలు తెలుపు, క్రీమ్ కలర్‌లో ఉంటాయి. బర్రె పాలల్లోని బీటాకెరోటిన్ రంగులేని విటమిన్ "ఏ"గా మారుతుంది. అందుకే బర్రె పాలల్లో పసుపు రంగు పోతుంది. ఆవు పాలల్లో కూడా బీటాకెరోటిన్ ఉంటుంది. కానీ తక్కువ మోతాదులో మాత్రమే ఉంటుంది.
మంచి నిద్ర పోవాలంటే రాత్రి పూట బర్రె పాలు తాగడం మంచిది. కోవా, పెరుగు, నెయ్యి, పన్నీర్, పాయసం వంటివి తయారు చేయడానికి బర్రె పాలు మంచివి. అదే ఆవు పాలల్లో క్రీమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి స్వీట్ల తయారీకి వీటిని ఉపయోగిస్తుంటారు. ఆవు పాలు, బర్రె పాల మధ్య తేడా ఉన్నప్పటికీ ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే. రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మన అవసరాలను బట్టి ఆవు పాలు కావాలా..? బర్రె పాలు కావాలా..? అన్నది నిర్ణయించుకోవాలి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com