కాల్షియం పూడికలు ఏర్పడటానికి కారణాలు..?
సాక్షి లైఫ్ : గుండె రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోవడం అనే సమస్య ఎక్కువగా వయసుపైబడినవారిలో తలెత్తుతుంది. దాదాపు 40 ఏళ్ల వయసు నుంచే కాల్షియం పేరుకోవడం మొదలవుతుంది. దానికితోడు అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్టరాల్ స్థాయిలు పెరుగుతుండటం, ఊబకాయం, దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి వల్ల కూడా ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. పొగాకు వాడకం వల్ల గుండె రక్తనాళాల్లో పూడికలు చాలా త్వరగా ఏర్పడతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి..ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఈ సమస్య రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..?
రక్తపోటును నియంత్రణలో ఉంచుకునేందుకు వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. కొలెస్టరాల్‌ను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అందుకోసం ఆహారంలో మార్పు చేర్పులు చేసుకోవాలి. వేపుళ్లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు పూర్తిగా మానేయడం ఉత్తమమని డాక్టర్లు సూచిస్తున్నారు.
మధుమేహం ఉంటే దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే గుండె రక్తనాళాల్లో కాల్షియం పూడిక ఏర్పడకుండా ఉంటుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అంతేకాదు గుండెకు మేలుచేసే ఆహారం తీసుకోవాలని, ధూమపానం, మద్యపానం మానేయాలని, తగిన వ్యాయామం చేయాలని, బరువు అదుపులో పెట్టుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
