కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?   

షేర్ చేయండి:
కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?   

సాక్షి లైఫ్ : "కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అనేది ఇప్పుడు అత్యంత సురక్షితమైన, విజయవంతమైన ప్రక్రియ. ముఖ్యంగా మోకాలి, తుంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో, రోబోటిక్ సర్జరీ వంటి విధానాలతో మరింత కచ్చితంగా జరుగుతున్నాయి. దీనివల్ల రోగులు తక్కువ సమయంలో కోలుకొని, సాధారణ జీవితాన్ని గడపగలుగుతారని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..?  

ఫిజియోథెరపీ: శస్త్రచికిత్స తర్వాత వైద్యుల పర్యవేక్షణలో తప్పనిసరిగా ఫిజియోథెరపీ చేసుకోవాలి. ఇది కీళ్ల కదలికను తిరిగి పొందడానికి, కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

బరువు నియంత్రణ: అధిక బరువు కారణంగా కీళ్లపై అదనపు భారం పడుతుంది. అయితే బరువును నియంత్రించడం ద్వారా కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆహారం: కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం.

క్రమం తప్పకుండా వ్యాయామం: తేలికపాటి వ్యాయామాలు, వాకింగ్ వంటివి కీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, వైద్యుల సలహా మేరకే వ్యాయామాలు చేయాలి. వైద్యుల సలహా : కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.