లోకల్ అనస్థీషియా ఎప్పుడు చేస్తారు..?
సాక్షి లైఫ్ : అనస్థీషియా అనేది వైద్య ప్రక్రియలో ఉపయోగించే పద్ధతి, ఇది రోగి శరీరంలో నొప్పిని తగ్గించడం లేదా కొద్దిసేపు మత్తుగా ఉంచడానికి చేస్తారు. ఇది సాధారణంగా శస్త్రచికిత్స లేదా ఇతర వైద్య ప్రక్రియల సమయంలోనే నిర్వహిస్తారు. అనస్థీషియా లోప్రధానంగా మూడు రకాలున్నాయి. వాటిలో ఒకటి లోకల్ అనస్థీషియా, రెండు రీజినల్ అనస్థీషియా, మూడు జనరల్ అనస్థీషియా. వీటిలో ఒక్కో రకమైన శస్త్ర చికిత్స చేసే సమయంలో ఒక్కో రకమైన అనస్థీషియా చేస్తుంటారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
లోకల్ అనస్థీషియా..
ఏమి జరుగుతుంది: ఈ రకమైన అనస్థీషియాలో శరీరంలోని ఒక చిన్న భాగం మాత్రమే మొద్దుబారిపోతుంది. ఉపయోగం: పుచ్చు దంతాలను తొలగించడం, కుట్లు మొదలైన చిన్న చిన్న శస్త్రచికిత్సల కోసం దీనిని ఉపయోగిస్తారు.
ఇది ఎలా పనిచేస్తుంది..? : ఔషధం చర్మంలోకి ఇంజెక్ట్ చేస్తారు, దీనివల్ల ఆ ప్రాంతంలోని నరాలు తాత్కాలికంగా మొద్దుబారుతాయి.
రీజినల్ అనస్థీషియా..
ఏమి జరుగుతుంది: ఈ రకమైన అనస్థీషియాలో, శరీరంలోని చాలా భాగం మొద్దుబారిపోతుంది. ఉపయోగం : కాలు లేదా చేయి శస్త్రచికిత్సలు చేస్తారు. ఇది ఎక్కువగా పెద్ద శస్త్రచికిత్సల సమయంలోనే వినియోగిస్తారు.
ఇది ఎలా పనిచేస్తుంది..? : ఔషధం వెన్నుపాము చుట్టూ ఉన్న పెద్ద నరాలలోకి లేదా సమీపంలోకి ఇంజెక్ట్ చేస్తారు.
జనరల్ అనస్థీషియా..
ఏమి జరుగుతుంది: ఈ రకమైన అనస్థీషియాలో రోగి పూర్తిగా అపస్మారక స్థితికి చేరుకుంటాడు.
ఉపయోగం : గుండె శస్త్రచికిత్స, మెదడు శస్త్రచికిత్స మొదలైన పెద్ద , సంక్లిష్టమైన శస్త్రచికిత్సల కోసం.
ఇది ఎలా పని చేస్తుంది..? : ఔషధం మొత్తం శరీరాన్ని ప్రభావితం చేసే సిరలోకి ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
