Health Tests : ఏ వయసులో ఏ టెస్ట్ అవసరం..? 20 నుంచి 40 ఏళ్ల మధ్య వారు చేయించుకోవాల్సిన హెల్త్ చెకప్స్..? 

సాక్షి లైఫ్ : ప్రస్తుతం జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితం, ఆఫీసు ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు ఇప్పుడు ఇరవై ఏళ్లకే పలకరిస్తున్నాయి. అందుకే వ్యాధి వచ్చాక బాధపడటం కంటే, రాకముందే గుర్తించడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గలవారు క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షల గురించి ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు అందించిన సూచనలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

భవిష్యత్తులో వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను అడ్డుకోవచ్చు..

20 ఏళ్ల వయసులో పునాది గట్టిగా ఉండాలి. ఈ వయసులో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం వల్ల భవిష్యత్తులో వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను అడ్డుకోవచ్చు. రక్తపోటు (BP), బాడీ మాస్ ఇండెక్స్ (BMI), కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC), ఫాస్టింగ్ గ్లూకోజ్, లిపిడ్ ప్రొఫైల్ ముఖ్యమైన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. 

మహిళలైతే గర్భాశయ క్యాన్సర్ ముప్పును గుర్తించేందుకు 21 ఏళ్ల నుంచి 'పాప్ స్మియర్' పరీక్ష చేయించుకోవాలి. హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్, టెటానస్, డిఫ్తీరియా (Tdap ఏటా ఇన్ఫ్లుయెంజా టీకాలు తీసుకోవడం ముఖ్యం.

30 ఏళ్ల వయసులో ..  

ఈ వయసులో జీవక్రియలో మార్పులు మొదలవుతాయి. మధుమేహం, కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ చరిత్రలో ఎవరికైనా షుగర్, బీపీ ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. బరువు నిర్వహణ, నిద్ర నాణ్యతపై దృష్టి పెట్టాలి. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఈ వయసులో ఎక్కువగా వస్తుంటాయి. అందుకే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ తప్పనిసరి. అలాగే రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాలి.హెపటైటిస్ బి టీకాలు తీసుకోకపోతే ఇప్పుడైనా వేయించుకోవాలి.

40 ఏళ్ల వయసులో.. 

ఈ వయసు నుంచి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు గణనీయంగా పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలతో పాటు HbA1c (మూడు నెలల సగటు చక్కెర), లిపిడ్ ప్రొఫైల్, కాలేయం (Liver), మూత్రపిండాల (Kidney) పనితీరు పరీక్షలు, ఈసీజీ (ECG) చేయించుకోవాలి. మహిళలు క్రమం తప్పకుండా 'మామోగ్రామ్' పరీక్షలు అవసరం. పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి వైద్యుని సంప్రదించాలి. కంటి చూపు, దంత పరీక్షలతో పాటు న్యుమోనియా, షింగిల్స్  రాకుండా టీకాలు తీసుకోవడం ఉత్తమం.

క్రమమైన పరీక్షలతో ప్రయోజనాలేమిటి..?

వ్యాధులు వాటి తీవ్రతను పెంచకముందే గుర్తించడం వల్ల చికిత్స సులభతరం అవుతుంది. సరైన సమయంలో టీకాలు, వార్షిక హెల్త్ చెకప్స్ చేయించుకోవడం వల్ల వ్యాధుల భారాన్ని తగ్గించుకుని ఆరోగ్యకరమైన, సుదీర్ఘమైన జీవితాన్ని గడపవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఏదైనా పరీక్ష చేయించుకునే ముందు మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి సంబంధిత వైద్యుని సలహా తీసుకోవడం మర్చిపోకండి.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : sugar-test general-health-checkup health-tests diagnostic-tests health-checkup
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com