రక్తదానం ఎవరు చేయవచ్చు..? మార్గదర్శకాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : రక్తదానం మహాదానం. ఇది అనేక మంది ప్రాణాలను నిలబెట్టే ఒక గొప్ప ప్రక్రియ. అయితే, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి అర్హులు కారు. రక్తదానం చేయాలనుకునే వారు కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. నేషనల్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ కౌన్సిల్ (ఎన్ బిటీ సీ) విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎవరు రక్తదానం చేయవచ్చు..? ఎవరు చేయకూడదు..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
రక్తదానం చేయడానికి అర్హతలు..
వయస్సు: 18 నుంచి 65 సంవత్సరాల వయస్సు గలవారు రక్తదానం చేయవచ్చు.
శరీర బరువు: కనీసం 45 కిలోల బరువు ఉండాలి. (కొన్నిసార్లు 50-55 కిలోల బరువు ఉన్నవారికి 450 మి.లీ. రక్తం తీసుకుంటారు.)
నాడి, రక్తపోటు:
నాడి నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి.
రక్తపోటు (సిస్టాలిక్) 100-180 మి.మీ. వరకు, (డయాస్టాలిక్) 50-100 మి.మీ. వరకు ఉండాలి.
హీమోగ్లోబిన్ స్థాయి: 100 మి.లీ. రక్తంలో కనీసం 12.5 గ్రాముల హీమోగ్లోబిన్ ఉండాలి.
శరీర ఉష్ణోగ్రత: సాధారణ శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెల్సియస్ (99.5 డిగ్రీల ఫారెన్‌హీట్) కంటే ఎక్కువ ఉండకూడదు.
సాధారణ ఆరోగ్యం: మూర్ఛ, కిడ్నీ వ్యాధులు, అలర్జీ, అసాధారణ రక్తస్రావ లక్షణాలు, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఇతర ప్రమాదకరమైన వ్యాధులు గతంలో గానీ ప్రస్తుతం గానీ ఉండకూడదు.
రక్తదానం చేయకూడని సందర్భాలు (తాత్కాలికంగా లేదా శాశ్వతంగా):
ఇటీవలి వ్యాధులు..ఇన్ఫెక్షన్లు..
మలేరియా: మలేరియా నుంచి కోలుకున్న తర్వాత మూడు నెలల వరకు రక్తదానం చేయకూడదు.
టైఫాయిడ్: టైఫాయిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఒక సంవత్సరం వరకు రక్తదానం చేయకూడదు.
క్షయ: క్షయ నుంచి పూర్తిగా నయమైందని నిర్ధారించిన తర్వాత రెండు సంవత్సరాల వరకు రక్తదానం చేయకూడదు.
రేబిస్ ఇంజెక్షన్: కుక్క కాటు తర్వాత రేబిస్ ఇంజెక్షన్ తీసుకుంటే, చివరి డోస్ నుంచి ఒక సంవత్సరం వరకు రక్తదానం చేయకూడదు.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
