Ayushman Card : ఆయుష్మాన్ కార్డ్ కు ఎవరెవరు అర్హులు..? ఉచిత వైద్యం అందుతుందా..? తెలుసుకోండి..!
సాక్షి లైఫ్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో రకాల ఆరోగ్య, ఆర్థిక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే 'ఆయుష్మాన్ భారత్'. అయితే, ఈ 'ఆయుష్మాన్ కార్డ్' ఎవరెవరు తీసుకోవచ్చు..? అసలు దీనికి మీ కుటుంబం అర్హులేనా..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? తదితర వివరాలు మీకోసం..ఆయుష్మాన్ కార్డ్ ఉన్నవారు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. ఈ కార్డు ద్వారా ఒక కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రి ఖర్చులను భరిస్తుంది.
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం..
ఆయుష్మాన్ కార్డ్ ఉన్నవారు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. ఈ కార్డు ద్వారా ఒక కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రి ఖర్చులను భరిస్తుంది.
ఈ కార్డు అందరికీ ఇస్తారా..?
లేదు, ఈ కార్డును ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి వీల్లేదు. దీనికంటూ ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన అర్హత ప్రమాణాలను నిర్ణయించింది. ప్రభుత్వం రూపొందించిన అర్హుల జాబితాలో (Eligibility List) పేరు ఉన్నవారు మాత్రమే ఈ ఆయుష్మాన్ కార్డును పొందే అవకాశం ఉంటుంది.
ఎవరెవరు అర్హులంటే..?
దినసరి కూలీలు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు. ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు. ఈఎస్ఐసీ (ESIC) వంటి ఇతర ప్రభుత్వ ఆరోగ్య బీమా సదుపాయాలు లేని వారు. పీఎఫ్ (PF) సదుపాయం ఉండి, ఇతర ఆరోగ్య ప్రయోజనాలు దక్కని కొందరు కార్మికులు. వయసు పైబడిన వారు ముఖ్యంగా 70 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇటీవల కేంద్రం ఈ కార్డును అందజేయాలని నిర్ణయించింది.
కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
ఆయుష్మాన్ కార్డును తీసుకోవడం ఇప్పుడు చాలా సులభం. కింది పద్ధతుల్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా..
ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్‌సైట్ pmjay.gov.in లోకి వెళ్లి, మీ వివరాలు నమోదు చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సీఎస్‌సీ సెంటర్లు (CSC)..
మీకు దగ్గర్లోని మీ-సేవ లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి అవసరమైన పత్రాలు ఆధార్, రేషన్ కార్డు అందించి నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో లేదా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక ఆయుష్మాన్ క్యాంపుల ద్వారా కూడా ఈ కార్డులను ఉచితంగా పొందవచ్చు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
