Better Health : ఇంట్లో ఈ 5 మొక్కలు పెంచితే.. అందంతో పాటు ఆరోగ్యమూ మీ సొంతం..!
సాక్షి లైఫ్ : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు ఇండోర్ ప్లాంట్స్ (Indoor plants) అద్భుతంగా సహాయపడతాయి. ఇవి ఇంటికి కొత్త అందాన్ని తీసుకురావడమే కాకుండా, గాలిలోని కాలుష్య కారకాలను తగ్గించి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. పెద్దగా నిర్వహణ అవసరం లేకుండా, సులభంగా పెంచుకోగలిగే టాప్ 5 ఇండోర్ ప్లాంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
స్నేక్ ప్లాంట్ (Snake Plant)..
ఇండోర్ మొక్కలలో ఇది అత్యంత ప్రజాదరణ పొందినది. దీని పొడవాటి, ఆకుపచ్చని ఆకులు గదికి మోడ్రన్ లుక్ ఇస్తాయి. ఇది తక్కువ వెలుతురులోనూ సులభంగా పెరుగుతుంది. దీనికి రోజూ నీళ్లు పోయాల్సిన అవసరం కూడా ఉండదు. సమయం దొరకని బిజీ లైఫ్‌స్టైల్ ఉన్నవారికి ఇది ఉత్తమ ఎంపిక.
మనీ ప్లాంట్ (Money Plant)..
మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ కనిపించే మొక్క ఇది. దీనిని మట్టిలోనే కాకుండా కేవలం నీసళ్లలో కూడా పెంచుకోవచ్చు. బాల్కనీలు, లివింగ్ రూమ్ గోడలపైకి దీని తీగలను పాకిస్తే ఎంతో అందంగా ఉంటుంది. ఇది చాలా త్వరగా పెరుగుతుంది, పైగా దీని సంరక్షణ కూడా చాలా సులభం.
పీస్ లిల్లీ (Peace Lily)..
మీ ఇంటికి మరింత ఆకర్షణీయమైన లుక్ ఇవ్వాలనుకుంటే పీస్ లిల్లీ సరైన ఎంపిక. ముదురు ఆకుపచ్చ రంగు ఆకులు, వాటి మధ్యలో పూసే తెల్లటి పూలు ఇంటి అలంకరణను రెట్టింపు చేస్తాయి. తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశాల్లో కూడా దీన్ని ఉంచవచ్చు. కుండీలోని మట్టిలో ఎప్పుడూ కాస్త తేమ ఉండేలా చూసుకుంటే ఈ మొక్క చక్కగా పెరుగుతుంది.
అరెకా పామ్ (Areca Palm)..
ఇంటి మూలలకు సహజమైన, ప్రీమియం లుక్ తీసుకురావడంలో అరెకా పామ్ ముందుంటుంది. పొడవాటి, గుబురుగా ఉండే దీని ఆకులు గదిలో ఎప్పుడూ తాజాదనాన్ని నింపుతాయి. డ్రాయింగ్ రూమ్, ఆఫీసులు లేదా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పెట్టుకోవడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. దీనికి నేరుగా సూర్యరశ్మి తగలకూడదు, అలాగే తగిన మోతాదులో మాత్రమే నీరు అందించాలి.
స్పైడర్ ప్లాంట్ (Spider Plant)..
సన్నగా, ఆకర్షణీయంగా ఉండే ఆకుల కారణంగా స్పైడర్ ప్లాంట్‌ను చాలామంది ఇష్టపడతారు. దీనిని చిన్న కుండీల్లో లేదా వేలాడదీసే కుండీల్లో (hanging baskets) కూడా పెంచుకోవచ్చు. అపార్ట్మెంట్లు, చిన్న ఇళ్లలో పెంచుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. తక్కువ వెలుతురులోనూ ఇది ఏపుగా పెరుగుతుంది.
ఇండోర్ ప్లాంట్స్ సంరక్షణకు ముఖ్యమైన చిట్కాలు..
కుండీల్లోని మట్టిలో తేమను గమనిస్తూ ఉండాలి. మొక్కలకు అవసరానికి మించి నీళ్లు పోయకూడదు. మొక్కలకు ఎండిపోయిన ఆకులు ఉంటే ఎప్పటికప్పుడు తీసేయాలి. ఈ మొక్కలకు నేరుగా ఎండ తగలకూడదు కానీ, పరోక్షంగా సహజమైన వెలుతురు తగిలే చోట ఉంచడం మంచిది. ఆకులపై దుమ్ము చేరకుండా క్రమం తప్పకుండా తడి గుడ్డతో శుభ్రం చేయడం వల్ల మొక్కలు మరింత అందంగా, పచ్చగా కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
