Oral care Tips : మీ టూత్‌బ్రష్‌ను ఎప్పుడు మార్చాలి..? ఎలా వాడాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పళ్లు తోముకోవడం మన దినచర్యలో భాగం. అయితే, చాలా ఇళ్లలో టూత్‌బ్రష్ పూర్తిగా అరిగిపోయి, దాని కుంచెలు (bristles) వంగిపోయే వరకు వాడేస్తుంటారు. పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ బ్రష్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో టూత్‌బ్రష్‌ను మార్చడం కూడా అంతే ముఖ్యం.ఓరల్ కేర్ టూత్‌బ్రష్ వినియోగానికి సంబంధించిన నిపుణుల సలహాలు మీకోసం.

 

ఇది కూడా చదవండి..Researchers Say Lifespan May Be Predictable : మన ఆయుష్షును అంచనా వేయవచ్చంటున్న పరిశోధకులు..

ఇది కూడా చదవండి..Dance to Burn Calories : డ్యాన్స్‌తో క్యాలరీలు బర్న్ : రోజూ 30 నిమిషాల డ్యాన్స్‌తో ఫిట్‌నెస్ మీ సొంతం..! 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

మీ టూత్‌బ్రష్‌ను ఎప్పుడు మార్చాలి..? ఎలా వాడాలి..?

 

1. బ్రష్‌ను ఎన్ని నెలలకు మార్చాలి..?

దంత వైద్యుల సలహా ప్రకారం.. సాధారణంగా ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి కచ్చితంగా టూత్‌బ్రష్‌ను మార్చాలి.

2. కుంచెలను (Bristles) బట్టి గుర్తించండి..

బ్రష్ మార్చడానికి క్యాలెండర్‌లో తేదీలు చూసుకోవాల్సిన అవసరం లేదు. మీ బ్రష్ కుంచెలు వంగిపోయినా, విడిపోయినా లేదా అరిగిపోయినట్లు కనిపించినా వెంటనే కొత్త బ్రష్ తీసుకోవడం మంచిది. కొంతమంది బ్రష్‌ను పళ్లపై గట్టిగా నొక్కి తోముతారు. అలాంటి వారిలో బ్రష్ త్వరగా పాడవుతుంది.

3. పాత బ్రష్‌ వాడితే ఏమవుతుంది..?

అరిగిపోయిన బ్రష్‌తో పళ్లు తోమడం వల్ల పళ్లపై పేరుకుపోయిన పాచి (plaque), బ్యాక్టీరియా సరిగ్గా తొలగిపోవు. పళ్లు శుభ్రం కావడం లేదని గట్టిగా తోమడం వల్ల చిగుళ్లు దెబ్బతింటాయి, పళ్లపై ఉండే రక్షణ పొర ఎనామిల్ అరిగిపోతుంది. కాబట్టి ఎల్లప్పుడూ మృదువైన (Soft) బ్రిసిల్స్ ఉన్న బ్రష్‌ను ఎంచుకోవడం ఉత్తమం.

4. రోజుకు ఎన్నిసార్లు..? ఎంతసేపు తోముకోవాలి..?

మంచి టూత్‌బ్రష్ ఎంచుకోవడమే కాదు, పళ్లు తోముకునే విధానం కూడా ముఖ్యమే. రోజుకు రెండుసార్లు, కనీసం రెండు నిమిషాల పాటు పళ్లు తోముకోవాలి. ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌ను వాడటం దంతాలకు రక్షణ ఇస్తుంది. బ్రష్‌ను చిగుళ్ల వద్ద 45 డిగ్రీల కోణంలో ఉంచి, మృదువుగా చిన్నచిన్న స్ట్రోక్స్‌తో పైకి, కిందకి శుభ్రం చేసుకోవాలి.

5. టూత్‌బ్రష్‌ను ఎలా భద్రపరుచుకోవాలి..?

పళ్లు తోముకున్న తర్వాత బ్రష్‌ను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. పేస్ట్, ఆహారపు కణాలు లేకుండా చూసుకోవాలి. బ్రష్‌ను నిలువుగా ఉంచి గాలికి ఆరనివ్వాలి. తడిగా ఉన్న బ్రష్‌ను వెంటనే మూతపెట్టిన డబ్బాలో (Closed container) ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు పెరిగే ప్రమాదం ఉంది.

6. దంత వైద్యుడిని (Dentist) ఎప్పుడు సంప్రదించాలి..?

చిగుళ్ల నుంచి తరచుగా రక్తం వస్తున్నా, వాపులు ఉన్నా, పళ్లలో నిరంతరం నొప్పి లేదా న్సిటివిటీ ఉన్నా, నోటి దుర్వాసన వస్తున్నా.. కేవలం టూత్‌బ్రష్ మారిస్తే సరిపోదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.