చైనా కొత్త వైరస్ ఎలాంటివారిపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది..?
సాక్షి లైఫ్ : చైనా సోషల్ మీడియా నుంచి వస్తున్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నివేదికల ప్రకారం, COVID-19 తర్వాత, కొత్త వైరస్, హ్యూమన్ మెటానిమోవైరస్(హెచ్ఎంపివి) చైనాలో వేగంగా వ్యాపిస్తోంది, అయితే ఈ వాదన నిజమేనా? ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది..? దీనికి ప్రధాన కారణాలు ఏంటి..? దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చైనా లో విజృంభిస్తున్న కొత్త వైరస్ కరోనా వంటి లక్షణాలున్నట్లు తెలుస్తోంది. ఈ మహమ్మారిపై సోషల్ మీడియాలో వాదనలు జరుగుతున్నాయి. ఈ న్యూ వైరస్ కు సంబంధించి చైనా ప్రభుత్వం గానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ గానీ ఇంకా ధృవీకరించలేదు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
హెచ్ఎంపివి వైరస్ అంటే ఏమిటి..?
హ్యూమన్ మెటా న్యుమోవైరస్ (హెచ్ఎంపివి) అనేది ఫ్లూ వంటి లక్షణాలు కలిగిన ఒకరకమైన వైరస్. దీని బారిన పడిన వారికి దగ్గు, జలుబు గొంతు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ వైరస్ శీతాకాలంలో ,వసంత ఋతువులో ఎక్కువగా వ్యాపిస్తుందని పలువురు పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఈ వైరస్ మన శరీరంలోని శ్వాసించే భాగాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా సందర్భాలలో, ఇది ముక్కు, గొంతు వంటి ఎగువ శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు కొన్నిసందర్భాలలో ఊపిరితిత్తులకు కూడా చేరుతుంది. న్యుమోనియా వంటి తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఎవరైనా ఇప్పటికే ఆస్తమా లేదా పల్మనాలజికల్ వంటి సమస్యలు ఉంటే, హెచ్ఎంపివి వైరస్ వారి వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
