Avoid Eating Walnuts : వాల్‌నట్స్ ఎలాంటి వాళ్లు తినకూడదు..? కారణాలేంటి..?
సాక్షి లైఫ్ : వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్,అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల వాల్‌నట్స్ ను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. ఇందులో ఉండే పోషకాలు మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా, చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
వాల్నట్స్ లో చాలా రకాల ఖనిజాలు, విటమిన్లు ఉన్నా అందరికీ మంచిది కాకపోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. కొంతమందికి, వాల్‌నట్స్ హానికలిగించే ప్రమాదం ఉంది, వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఎలాంటి వాళ్లు వాల్‌నట్స్ తినకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
వాల్‌నట్స్‌ను ఎవరు నివారించాలి అంటే..?
నట్స్ అలెర్జీలు ఉన్నవాళ్లకు.. వాల్‌నట్స్ ప్రమాదకరం. వాటిని తినడం వల్ల దురద, దద్దుర్లు, గొంతులో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లకు..
వాల్‌నట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, కానీ వాటిని అధికంగా తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి హెల్త్ ఇషుస్ వస్తాయి. ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్ లేదా ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారు వాల్నట్స్ ను తీసుకోకపోవడమే మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
రక్తస్రావ రుగ్మతలు ఉన్న బాధితులు..
వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్తాన్ని పలుచన చేస్తాయి. రక్తం గడ్డకట్టే సమస్యలు లేదా రక్తస్రావ సంబంధిత సమస్యలు ఉన్నవారు వాల్‌నట్స్‌కు దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి రక్తస్రావ ప్రమాదాన్ని పెంచుతాయి కాబట్టి.
శస్త్రచికిత్స చేయించుకోబోయే వాళ్లు కనీసం రెండు వారాల ముందు వాల్‌నట్స్ తినడం మానేయాలి. వాల్‌నట్స్ రక్తాన్ని పలుచగా చేసి, శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావాన్ని పెంచుతాయి.
బరువు తగ్గడానికి ప్రయత్నించేవాళ్లు..
వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి కానీ కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గించే డైట్ ఫాలో అయ్యే వాళ్లు, వాల్‌నట్స్‌ను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
మూత్రపిండాల్లో రాళ్లున్న వాళ్లు..
వాల్‌నట్స్‌లో ఉండే ఆక్సలేట్లు మూత్రపిండాల్లో రాళ్లను తీవ్రతరం చేస్తాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించకుండా వాల్‌నట్స్ తినకూడదు.
మధుమేహ సమస్యలున్న వాళ్లు..
వాల్‌నట్స్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయ పడినప్పటికీ, వాటిని ఎకుఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు మరింతగా పడిపోయే ప్రమాదం ఉంటుంది.
వాల్‌నట్స్ ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటాయి, కానీ అవి కొంతమందికి హానికలిగించే అవకాశం ఉంది. అలెర్జీలు, జీర్ణ సమస్యలు, రక్తస్రావం రుగ్మతలు, మూత్రపిండాల్లో రాళ్లున్న బాధితులు, శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన వాళ్లు వాల్నట్స్ తీసుకోకూడదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..Women Outlive Men : ఆయుష్షులో 'ఆడవారే' మేటి.. మగాళ్ల ఆయువు ఎందుకు తగ్గుతోంది..? కేరళ యూనివర్సిటీ షాకింగ్ సర్వే..!
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
