మగ దోమలు మనుషుల్ని ఎందుకు కుట్టవో మీకు తెలుసా..? 

సాక్షి లైఫ్ : వర్షాకాలంలో, దోమల వల్ల వచ్చే వ్యాధులను నివారించడం చాలా కష్టం. ఈ సీజన్‌లో ఈ వ్యాధులు మహమ్మారిలా వ్యాప్తి చెందుతాయి. డెంగ్యూ, చికున్‌గున్యా , మలేరియా వాటిలో ప్రముఖమైనవి. చూడడానికి దోమలు చిన్నవిగా ఉండవచ్చు, కానీ వాటి కాటు వల్ల వచ్చే వ్యాధులు మాత్రం ప్రాణాంతకమైనవి. తీవ్రమైన వ్యాధులకు కారణమైన దోమలు సింహాలు లేదా పాముల వంటి జంతువుల కంటే ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. దోమల గురించి ఆశ్చర్యకరమైన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

 ఇది కూడా చదవండి.. హిమోగ్లోబిన్‌ పెరగాలంటే..? ఈ ఆహారాలు తినండి.. 

 ఇది కూడా చదవండి.. ఇవి స్త్రీ, పురుషులకు ఒక వరం లాంటివి..  

 ఇది కూడా చదవండి.. ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..? 

మగ దోమలు ఎప్పుడూ కుట్టవని మీకు తెలుసా..? అవును.. ఎక్కువగా కుట్టేది ఆడ దోమలే. ఆడ దోమలు వాటి గుడ్ల అభివృద్ధికి ప్రోటీన్ అవసరం. ఆ ప్రోటీన్ మానవుల రక్తంలో లభిస్తుంది.మగ దోమలు తమ మనుగడకు అవసరమైన చక్కెరను పొందడానికి తియ్యగా ఉండే మొక్కల రసాలను మాత్రమే తింటాయి. మగదోమలు కాటు వేయవు కాబట్టి వీటి ద్వారా ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందవు. 

ఆడ దోమలు.. 


ఆడ దోమలు రక్తాన్ని తాగుతాయి. మగదోమలతో పోలిస్తే ఆడదోమలు చిన్నగా ఉంటాయి. ఆడదోమలకు సూది లాంటి మొన ఉంటుంది, అది కాటు వేయడానికి ఉపయోగిస్తాయి.
 మగదోమలకు గుబురుగా, వెంట్రుకల యాంటెన్నా ఉంటుంది, అయితే ఆడదోమలకు ఉండే యాంటెన్నా చాలా తక్కువ వెంట్రుకలు కలిగి ఉంటుంది. 

 ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : male mosquitoes facts-about-mosquitoes unknown-facts-about-mosquitoes diseases-transmitted-by-mosquitoes dangerous-disease-transmitted-by-mosquito mosquito-borne-diseases 5-diseases-caused-by-mosquitoes mosquito-borne-diseases-transmited do-you-know-female-mosquitoes do-you-know-about-male-mosquitoes do-male-mosquitoes-bite-humans why-do-female-mosquitos-bite female-mosquito female-mosquitoes why-do-female-mosquito-bite-us do-only-female-mosquito-bite-us male-mosquito female-mosquitos

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com