Egg White or Egg Yolk : గుడ్డులో 'అసలు' బలం ఎందులో ఉంటుంది..? తెల్లసొన, పచ్చసొన..?

షేర్ చేయండి:
Egg White or Egg Yolk : గుడ్డులో 'అసలు' బలం ఎందులో ఉంటుంది..? తెల్లసొన, పచ్చసొన..?

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలన్నా, కండర పుష్టి పెరగాలన్నా 'రోజూ ఒక గుడ్డు తినాల్సిందే' అని వైద్యులు చెబుతుంటారు. అయితే, గుడ్డు తినేటప్పుడు చాలామందికి వచ్చే అతిపెద్ద సందేహం 'తెల్లసొన మాత్రమే తినాలా? లేక పచ్చసొనతో కలిపి తినాలా?' అని. ముఖ్యంగా బాడీ బిల్డింగ్ చేసేవారు, బరువు తగ్గాలనుకునే వారు పచ్చసొనను పక్కన పెట్టేస్తుంటారు. కానీ, పోషకాల విషయంలో అసలు నిజాలు వేరేలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

దేనిలో ఎంత ప్రోటీన్ అంటే..?

గుడ్డులోని రెండు భాగాల్లోనూ ప్రోటీన్ ఉన్నప్పటికీ, వాటి పరిమాణం మరియు సాంద్రతలో స్వల్ప తేడాలు ఉన్నాయి. తెల్లసొన (Egg White).. ఒక సాధారణ పరిమాణం గల గుడ్డు తెల్లసొనలో సుమారు 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో కొవ్వులు, కొలెస్ట్రాల్ అసలు ఉండవు. అందుకే దీనిని 'లీన్ ప్రోటీన్'కు ఉత్తమ వనరుగా భావిస్తారు.

పచ్చసొన (Egg Yolk).. ఒక పచ్చసొనలో సుమారు 2.7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అయితే, ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గ్రాముల లెక్కన చూస్తే తెల్లసొన కంటే పచ్చసొనలోనే ప్రోటీన్ సాంద్రత (Concentration) ఎక్కువ. కానీ గుడ్డులో తెల్లసొన పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల, మొత్తం ప్రోటీన్‌లో సింహభాగం దాని నుంచే అందుతుంది.

పచ్చసొన విషయంలో..

చాలామంది కొలెస్ట్రాల్ భయంతో పచ్చసొనను పక్కన పెడతారు. కానీ, గుడ్డులోని విటమిన్లు (A, D, E, K), బి-కాంప్లెక్స్, ఐరన్, జింక్ మరియు కోలిన్ వంటి కీలక పోషకాలన్నీ కేవలం పచ్చసొనలోనే ఉంటాయి. గుండె ఆరోగ్యం..ఆరోగ్యవంతులు రోజుకు ఒక పచ్చసొన తిన్నా ప్రమాదం లేదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

మెదడు పనితీరు..పచ్చసొనలో ఉండే 'కోలిన్' మెదడు చురుగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తికి తోడ్పడుతుంది.

ఎవరు ఏది తీసుకోవాలి..?

బరువు తగ్గేవారు..తక్కువ కెలొరీలతో ఎక్కువ ప్రోటీన్ కావాలనుకుంటే తెల్లసొన (Egg Whites) ఉత్తమం.

పిల్లలు, గర్భిణులు.. ఎదుగుదల కోసం గుడ్డును మొత్తం (Whole Egg) తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

క్రీడాకారులు ఎక్కువ ప్రోటీన్ కోసం 4-5 తెల్లసొనలతో పాటు, ఒక పచ్చసొనను కలిపి తీసుకోవడం వల్ల సరైన పోషణ అందుతుంది.

 గుడ్డు తెల్లసొనలో ప్రోటీన్ ఎక్కువగా ఉన్న మాట నిజమే, కానీ పూర్తిస్థాయి పోషకాలు అందాలంటే పచ్చసొనను పూర్తిగా వదిలేయకూడదు. రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహాతో పచ్చసొన పరిమాణాన్ని నియంత్రించుకోవాలి.  

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.