Heart Disease Deaths : ఢిల్లీలో గత 20 ఏళ్లలో గుండె జబ్బుల మరణాలు.. 3లక్షలకుపైనే..
సాక్షి లైఫ్ : మనదేశ రాజధానిలో 20 ఏళ్లలో గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల కారణంగా 3లక్షల కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వం నుంచి అధికారిక డేటా చెబుతున్న లెక్కలివి. యువకుల్లోనే ఎక్కువగా ఈ మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పురుషులలో గుండె సంబంధిత మరణాలు మహిళల కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ ఉన్నాయట.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
2024సంవత్సరంలో ఢిల్లీలో 34,539 మంది గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల వల్ల మరణించారు, 2023లో నమోదైన 22,385 మరణాలతో పోలిస్తే ఇది 12,000 కంటే ఎక్కువ, ఇది ఒకే సంవత్సరంలో 50 శాతం కంటే ఎక్కువ.
ఢిల్లీ ప్రభుత్వ ఆర్థిక, గణాంకాల డైరెక్టరేట్ ఆరోగ్య-మరణ గణాంకాల ప్రకారం, 2005 నుంచి 2024 మధ్య ఢిల్లీలో గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల కారణంగా మొత్తం 329,857 మరణాలు నమోదయ్యాయి. వీరిలో 210,206 మంది పురుషులు, 119,626 మంది మహిళలు 25 ఇతరులు ఉన్నారు.
గుండెపోటు సంకేతాలు..
ఈ గణాంకాలను వయస్సుల వారీగా పరిశీలిస్తే, 103,972 అత్యధిక మరణాల్లో 45 నుంచి 64 సంవత్సరాల వయస్సు కలిగినవారిలో ఎక్కువగా సంభవించాయి. 65 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 92,048 మంది, 25 నుంచి 44 సంవత్సరాల వయస్సు గలవారు 46,129మంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే..? 14 అంతకంటే తక్కువ వయస్సు ఉన్న 14,321 మంది పిల్లలు మొత్తం మరణాలలో ఐదు శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు.
గణాంకాలు..
45 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల పురుషులు మహిళలతో పోలిస్తే గుండె జబ్బుల మరణాల సంఖ్యను దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 68,177 మంది పురుషులు, 35,795 మంది మహిళలు మరణించారు. అదేవిధంగా ఢిల్లీలోని వివిధ ఆసుపత్రులలో అత్యధికంగా 45-64 సంవత్సరాల వయస్సు గలవారు 38.55 శాతం మరణాలకు కారణమయ్యారు. 65 ఏళ్లు పైబడిన వారు 34.13 శాతం, 25-44 ఏళ్ల వయస్సు కలిగిన వారు 17.11 శాతం ఉన్నారు.
గుండె జబ్బులు పెరగడానికి..
గుండె జబ్బులు పెరగడానికి జీవనశైలి ఒక ప్రధాన కారణంగా మారుతోందని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొందరిలో జన్యుపరమైన అంశాలు ఉన్నప్పటికీ, చిన్న వయస్సులోనే గుండెపోటు ముప్పునకు జీవనశైలే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. నిశ్చల జీవనశైలి, అధిక స్క్రీన్ సమయం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపానం, వేపింగ్, నిద్ర లేకపోవడం, అధిక ఒత్తిడి గుండె ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. పెరుగుతున్న ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సకాలంలో జీవనశైలి మార్పులు అత్యంత ప్రభావవంతమైన మార్గమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
