చలికాలంలో ఉదయం నిద్రలేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది..? 

షేర్ చేయండి:
చలికాలంలో ఉదయం నిద్రలేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది..? 

సాక్షి లైఫ్ : ఉదయం నిద్ర లేవగానే మనసంతా ఎంతో ఫ్రెష్ గా ఎనర్జిటిక్ గా అనిపిస్తుంది. కానీ చలికాలంలో అలా ఉండదు. కొందరికి పొద్దున్నే నిద్ర లేవగానే తలనొప్పిగా అనిపిస్తుంది. దీని వల్ల రోజంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చలికాలంలో ఉదయం నిద్రలేవగానే తలనొప్పి ఎందుకువస్తుంది..? దీనికి ప్రధాన కారణాలేంటి..? ఏం చేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చో తెలుసా..?

చలికాలంలో ఉదయం తలనొప్పిగా అనిపించడానికి పలురకాల కారణాలున్నాయి. వీటిలో ఒత్తిడి, డీహైడ్రేషన్ సమస్య, చల్లగా ఉండడం, బెడ్ రూమ్ లో ఉష్ణోగ్రతల మార్పులు, నిద్ర తగ్గడం. 

సాధారణంగా చలికాలంలో తలనొప్పి సమస్య శరీరంలో నీరు లేకపోవడం వల్ల తలెత్తుతుంది. చలికాలంలో శరీరానికి సరిపడా నీరు తాగాలి. ఎందుకంటే చలి కారణంగా తక్కువ నీరు తాగుతుంటారు. దీని కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీని కారణంగా తలనొప్పిగా అనిపిస్తుంది. కాబట్టి శరీరాన్ని డీహైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. రోజంతా కనీసం పురుషులైతే 3.7లీటర్ల నీరు తాగాలి,మహిళలైతే 2.7లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది.  

మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి లేదా ఏదైనా వ్యక్తిగత కారణాలు ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఒత్తిడిని నియంత్రించడానికి ప్రయత్నించండి.  

 చలికాలంలో సైనస్ సంబంధిత సమస్యలు వస్తాయి. జలుబు, దగ్గు కారణంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అంతేకాదు దీనివల్ల తలనొప్పి కూడా వస్తుంది. అందువల్ల, మీ గదిలో హ్యూమిడిఫైయర్‌ను ఉపయోగిస్తే గాలిలో తేమను పీల్చుకుంటుంది. అప్పుడు మీకు శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

రాత్రిపూట మందపాటి దుప్పట్లను ఉపయోగించడంతోపాటు, చల్లని గాలులు తల,చెవులకు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేస్తే ఉదయం నిద్రలేచిన తర్వాత తలనొప్పి సమస్య ఉండదు.

నిర్ణీత సమయంలో నిద్రించాలి. శరరంలో ఉండే అంతర్గత గడియారాన్ని సిర్కాడియన్ రిథమ్ అంటారు. దీనికి భంగం కలగడం వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల, నిద్రపోవడానికి, మేల్కొలపడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి. తద్వారా అంతర్గత గడియారం మెరుగ్గా పని చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి కూడా తలెత్తదు.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

  

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.