Why Does Thyroid Cause Weight Gain : థైరాయిడ్ విషయంలో బరువు ఎందుకు పెరుగుతారు..? నియంత్రణకు మార్గాలివే..!
సాక్షి లైఫ్ : ఆహారపు అలవాట్లు, దినచర్యలో పెద్దగా మార్పులు లేకపోయినా అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా? అయితే దానికి 'థైరాయిడ్' ఒక ప్రధాన కారణం కావచ్చు. ముఖ్యంగా 'హైపోథైరాయిడిజం' (Hypothyroidism) సమస్య ఉన్నప్పుడు శరీరంలో జీవక్రియల రేటు (metabolic rate) మందగించి, వేగంగా బరువు పెరుగుతారు. శరీరంలో శక్తి వినియోగం, జీవక్రియలను నియంత్రించడంలో థైరాయిడ్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని ఉత్పత్తి తగ్గినప్పుడు, క్యాలరీలు ఖర్చయ్యే వేగం తగ్గి శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
థైరాయిడ్ సమస్యలో బరువు ఎందుకు పెరుగుతారు..?
శరీరంలో క్యాలరీలను కరిగించే సామర్థ్యాన్ని థైరాయిడ్ హార్మోన్ ప్రభావితం చేస్తుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గినప్పుడు మెటబాలిజం నెమ్మదిస్తుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకున్నా, చిన్న పనులు చేసినా త్వరగా బరువు పెరుగుతారు.
శరీరంలో నీరు చేరడం (Water Retention)..
థైరాయిడ్ సమస్య కారణంగా శరీరంలోని కణజాలాల్లో ద్రవాలు పేరుకుపోతాయి. ఇది కూడా శరీరం ఉబ్బినట్లుగా కనిపించడానికి, బరువు పెరగడానికి ఒక కారణం.
నీరసం, శారీరక శ్రమ తగ్గడం..
హైపోథైరాయిడిజంతో బాధపడేవారు తరచుగా అలసట, నీరసానికి గురవుతుంటారు. శక్తి లోపించడం వల్ల శారీరక శ్రమ తగ్గి, అది బరువు పెరగడానికి దారితీస్తుంది.
బరువును అదుపులో ఉంచుకోవడం ఎలా..?
సమయానికి మందులు వాడాలి: వైద్యుల సూచన మేరకు థైరాయిడ్ మందులను ప్రతిరోజూ సరైన సమయానికి వేసుకోవాలి. మందులు మానేయడం లేదా వేసుకునే సమయాలు మార్చడం వల్ల హార్మోన్ల అసమతుల్యత మరింత పెరుగుతుంది.
ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం..
పప్పు ధాన్యాలు, పనీర్, గుడ్లు, పెరుగు వంటి ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోండి. ఇవి కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉంచి, అతిగా తినకుండా అడ్డుకుంటాయి. కండరాలను దృఢంగా ఉంచుతాయి.
రోజూ వ్యాయామం తప్పనిసరి..
ప్రతిరోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు నడక (walking), యోగా, సైక్లింగ్ లేదా తేలికపాటి కార్డియో వ్యాయామాలు చేయాలి. ఇవి జీవక్రియలను తిరిగి చురుగ్గా మారుస్తాయి.
జంక్ ఫుడ్‌కు దూరం..
ప్రాసెస్ చేసిన ఆహారాలు, తీపి పానీయాలు (soft drinks), నూనెలో వేయించిన పదార్థాలు బరువును మరింత పెంచుతాయి. వీటికి వీలైనంత దూరంగా ఉండటమే ఆరోగ్యానికి శ్రేయస్కరం. నిద్రలేమి అనేది హార్మోన్ల అసమతుల్యతను తీవ్రం చేస్తుంది. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
