ఫుడ్ ప్యాకింగ్ కు అల్యూమినియం ఫాయిల్ వాడటం ఎందుకు ప్రమాదకరం..?
సాక్షి లైఫ్ : వేడి లేదా చల్లని ఆహారాన్ని అల్యూమినియం ఫాయిల్‌లో ప్యాక్ చేయడం చాలా హానికరం అని మీరు వినే ఉంటారు. ముఖ్యంగా వేడి లేదా పుల్లని ఆహార పదార్థాలు అంటే నిమ్మకాయ, టమోటా, ఊరగాయ వంటివి అందులో చుట్టడం వల్ల అల్యూమినియం కణాలు ఆహారంలో కలిసిపోతాయి, ఇది శరీరానికి తీవ్రహాని కలిగిస్తాయి.
ఇది కూడా చదవండి..ఏ వయసులో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది..?
ఇది కూడా చదవండి..న్యూ రీసెర్చ్ : ఫ్యాటీ లివర్ సమస్యలు ఎవరిలో ఎక్కువగా వస్తున్నాయి..? కారణాలేంటి..?
ఇది కూడా చదవండి..నారింజ తినడంవల్ల ఏమైనా దుష్ప్రభావాలున్నాయా..?
అయితే, అల్యూమినియం అంత ప్రమాదకరమైనది అయితే, దానిని మందుల ప్యాకేజింగ్‌లో ఎందుకు ఉపయోగిస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి, అల్యూమినియం ఫాయిల్‌ను ఫుడ్ ప్యాకేజింగ్, మందులు వంటి వివిధ ఉత్పత్తుల కోసం ఉపయోగిస్తారు. అల్యూమినియం ఫాయిల్‌ను మందులలో ఎందుకు సురక్షితంగా పరిగణిస్తారో, ఆహారంలో దాని వాడకాన్ని ఎందుకు నివారించాలంటే..?
ఆహారాన్ని అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టినప్పుడు..
మనం వేడి లేదా పుల్లని ఆహారాన్ని అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టినప్పుడు, ఫాయిల్‌లోని కొంత భాగం ఆహారంలో కరిగిపోవచ్చు. పరిశోధన ప్రకారం, అల్యూమినియం ఎక్కువ మొత్తంలో శరీరంలోకి ప్రవేశిస్తే, అది మెదడు, ఎముకలపై దుష్ప్రభావాన్ని చూపుతుంది.
అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ ప్రమాదం మరింతగాపెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అల్యూమినియం ఫాయిల్‌ను ఓవెన్ లేదా తందూర్‌లో ఉపయోగించడం వల్ల దాని చిన్న కణాలు ఆహారంలో కలిసిపోతాయి. ఇవి శరీరంలో ఎక్కువ కాలం పేరుకుపోతే నాడీ సంబంధిత సమస్యలను అంటే అల్జీమర్స్ వంటివి పెరుగుతాయి. అల్యూమినియం ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అల్యూమినియం తేలికైన లోహం, శరీరం దానిని తక్కువ పరిమాణంలో బయటకు పంపగలదు, కానీ అది ఎక్కువ పరిమాణంలో పేరుకుపోతే, అది నాడీ వ్యవస్థతోపాటు మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
ఇది కూడా చదవండి..HbA1c స్థాయి 10 కంటే ఎక్కువగా ఉంటే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి..ప్రాసెస్ చేసిన ఆహారం తినడం గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?
ఇది కూడా చదవండి..ఏమేం విటిమిన్స్ ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
