ఏ వయసులో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : జీవనశైలిలో తప్పిదాలు, ఆహారపు అలవాట్ల విషయంలో నిర్లక్ష్యం కారణంగా చాలా మంది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం దేశంలో గర్భాశయ క్యాన్సర్ సమస్య ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయగలిగేలా దాని లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. ఆయా లక్షణాలు ఎలా ఉంటాయి..? ఎలా గుర్తించాలంటే..? 

 

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?.. 

ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు

ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

 

కొన్ని వ్యాధులు శరీరంలో ఎటువంటి నిర్దిష్ట లక్షణాలు లేకుండానే కనిపిస్తాయి. మనం గుర్తించే సమయానికి, ఆయా వ్యాధి ముదిరిపోతుంది. గర్భాశయ క్యాన్సర్ కూడా అలాంటి తీవ్రమైన వ్యాధే. ఇది నెమ్మదిగా పెరుగుతుంది, కానీ మనం శరీర సంకేతాలను అర్థం చేసుకుంటే దానిని ముందుగానే గుర్తించి చికిత్స చేయవచ్చు. 

గర్భాశయ క్యాన్సర్ ముఖ్యంగా వయస్సు పెరిగిన మహిళలలో కనిపిస్తుంది. ఇది వయోపరితమైన సమస్యగా భావిస్తారు, ఎందుకంటే వయస్సు పెరిగినపుడు హార్మోన్ల మార్పులు, ఇతర జీవనశైలి కారణాల వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.  

సాధారణంగా, 50 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ ప్రమాదం ఎక్కువగా ఉంటది. సాధారణంగా 35 సంవత్సరాల తర్వాతనే మహిళల్లో హార్మోన్స్ లో మార్పులు సంభవించే అవకాశం ఉంటుందని, అప్పటి నుంచే ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.