ఈ మొక్కలతో వర్షాకాలంలో దోమల బెడదను అధిగమించవచ్చు..?
సాక్షి లైఫ్ : వర్షాకాలంలో దోమల బెడద తీవ్రంగా పెరుగుతుంది. దోమలు కుట్టడం వల్ల రకరకాల జ్వరాలు, ఇతర వ్యాధులు తలెత్తుతాయి. ఆందోళన, కానీ కొన్ని మొక్కలు సహాయపడగలవని మీకు తెలుసా? దోమలను అరికట్టడానికి మీరు మీ గార్డెన్‌లో లేదా ఇంటి లోపలకొన్నిరకాల మొక్కలను పెంచుకోవడం ద్వారా దోమల బెడద నుంచి తప్పించుకోవచ్చు. అవేంటంటే..?
ఇది కూడా చదవండి..ఔషధాలతో పని లేకుండా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చా..?
ఇది కూడా చదవండి..ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
తులసి..
తులసి దోమల లార్వాలను చంపడంలో ఈగలు వంటి కీటకాలను తిప్పికొట్టడంలో ప్రభావవంతంగా ఉంటుంది. నిమ్మ తులసి, దాల్చిన చెక్క తులసి వంటి రకాలు కూడా దోమలను దూరంగా ఉంచడంలో మంచివి.
పుదీనా..
పుదీనా ఉన్న ప్రాంతానికి దోమలరావు. కంటైనర్లలో సులువుగా దీనిని పెంచుకోవచ్చు. ఈ మొక్కకు తగినంత వెలుతురు ,తేమను అందిస్తే చాలా బాగా పెరుగుతుంది.
వెల్లుల్లి..
వెల్లుల్లి ఒక శక్తివంతమైన సహజ వికర్షకం, దోమలు, ఇతర కీటకాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. వెల్లుల్లి ముక్కలు దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంచడం వల్ల అవి రాకుండా ఉంటాయి. కాబట్టి దోమలను పారదోలడానికి వెల్లుల్లి మొక్క పెంచుకోవడం ఉత్తమం.
నిమ్మగడ్డి..
నిమ్మగడ్డి సువాసనకు ప్రసిద్ధి చెందింది. ఇది సహజమైన దోమల వికర్షకంలా పనిచేస్తుంది. ఈ మొక్క ఎండను కూడా తట్టుకోగలదు. కానీ మంచు సమయంలో ఇంటి లోపల ఉంచాలి. నిమ్మగడ్డి ఇంట్లో ఉంటే దోమలు దరిచేరవు.
సిట్రోనెల్లా గడ్డి..
లెమన్‌గ్రాస్ మాదిరిగానే ఉంటుంది. సిట్రోనెల్లా గడ్డి దోమలు, తెల్లదోమలను తిప్పికొట్టే సువాసనను వెదజల్లుతుంది. దీనిని ఇంటి లోపల లేదా ఆరుబయట పెంచవచ్చు.
లావెండర్..
లావెండర్ దీని నుంచి వచ్చే వాసనకు దోమలు,ఇతర కీటకాలు దూరంగా పారిపోతాయి. ఈ మొక్క అన్ని ప్రదేశాలలో పెరుగుతుంది.
రోజ్మేరీ..
ఇంటి వాతావరణంలో కూడా ఇది పెరుగుతుంది. ఇంటి లోపల చిన్న కుండలలో సులభంగా పెంచవచ్చు. దీని స్మెల్ చూస్తే దోమలు దగ్గరకు రావు.
ఇది కూడా చదవండి..డయాబెటీస్ ఉన్నవాళ్లు తేనే తినొచ్చా..?
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
