ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2025: ప్రాణదాతలకు వందనం..!
సాక్షి లైఫ్ : రక్తదానం అనేది ఓ మహోన్నత దానం. సరైన సమయంలో రక్తం అందక ఎంతోమంది విగతజీవులుగా మారుతున్నారు. సరైన సమయంలో రక్తం లభించక పోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కీలక విషయాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ, రక్తదానంపై అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటారు.
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. శరీరాన్ని సజావుగా నడపడంలో రక్తం పాత్ర ఏమిటి..?
ప్రపంచ రక్తదాతల దినోత్సవం నేపథ్యం..
ఈ దినోత్సవాన్ని 2004లో ప్రారంభించారు. ఆ తర్వాత 2005లో 58వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ దీనిని వార్షిక ప్రపంచ కార్యక్రమంగా ప్రకటించింది. అప్పటి నుంచి, ప్రతి సంవత్సరం జూన్ 14న ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది – ఆధునిక రక్త మార్పిడికి పితామహుడిగా పేరుపొందిన శాస్త్రవేత్త, వైద్యుడు కార్ల్ ల్యాండ్‌స్టైనర్ జన్మదినం కూడా జూన్ 14 కావడం విశేషం.
రక్తదానం - ఎంతో అవసరం..
రక్తదానం ద్వారా ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చు. జూన్ 14 రక్తదాతల త్యాగాన్ని గౌరవించే రోజు. ఈ దినోత్సవం రక్తదానం గురించి అవగాహనను పెంచడమే కాకుండా, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయమని ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరి జీవితాన్ని నిలబెట్టగలదు.
ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
ఇది కూడా చదవండి..మెదడు కణితులకు జన్యుపరమైన కారణాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
