World Health Organization: టీబీ బాధితులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రధాన మార్గదర్శకాలు.. 

షేర్ చేయండి:
World Health Organization: టీబీ బాధితులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రధాన మార్గదర్శకాలు.. 

సాక్షి లైఫ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization) టీబీ (tuberculosis)బాధితులకు కొన్నిప్రధాన మార్గదర్శకాలు సూచించింది. టీబీ వ్యాధి నయం అవ్వడానికి అవసరమైన సలహాలను అందించింది. పోషకాహారంపై అవగాహన.. టీబీ రోగులందరికీ, అలాగే వారి కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా పోషకాహారానికి సంబంధించి అవగాహన కల్పించాలి. ఆహార అభద్రత ఉన్న ప్రాంతాల్లో టీబీ రోగుల కుటుంబాలకు, ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యులకు వ్యాధి రాకుండా నివారించడానికి పోషకఆహారం అందించాలి.

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

పోషకాహారం (Nutritional Interventions): పోషకాహార లోపంతో బాధపడుతున్న టీబీ రోగులందరికీ (వయస్సుతో, గర్భధారణ స్థితితో లేదా వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా) పోషక మద్దతు ఇవ్వాలి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కొత్త విధానం ద్వారా టీబీ వ్యాధి నియంత్రణలో ఉంచడమేకాకుండా ఒక సమగ్ర, కుటుంబ-కేంద్రీకృత దృక్పథం అమలు చేయాలని సూచించింది. వైద్య చికిత్సతో పాటు పోషకాహార భద్రత కల్పించడం ద్వారా, టీబీని తరిమి కొట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది టీబీని అంతం చేసే ప్రపంచ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక ముఖ్యమైన ముందడుగు అని డబ్ల్యూ హెచ్ ఓ వెల్లడించింది.

ఇప్పటికే భారతదేశంలో నిక్షయ్ పోషణ్ యోజన (Ni-kshay Poshan Yojana) కింద టీబీ రోగులకు నెలకు రూ.500 చొప్పున పోషకాహార సహాయం అందిస్తున్నారు. కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో ఈ పథకాన్ని మరింత పటిష్టం చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.