Myths - Facts : నలుపు రంగు బ్రా ధరించడం వల్ల క్యాన్సర్ వస్తుందా.. ?
సాక్షి లైఫ్ : నలుపు రంగు బ్రా ధరించడం వల్ల క్యాన్సర్ వస్తుందా.. ? గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒక తెల్లవెంట్రుకను తొలగించడం వల్ల వెంట్రుకలన్నీ తెల్లగా మారతాయా..? వీటిలో ఏది అపోహ, ఏది వాస్తవం అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
అపోహ: నలుపు రంగు బ్రా ధరించడం వల్ల క్యాన్సర్ వస్తుందా.. ?
వాస్తవం: నలుపు లేదా ఏదైనా ముదురు రంగు బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా..? నలుపు రంగు బ్రా ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని ప్రచారం ఉంది. ఇది ఏమాత్రం నిజం కాదు. కాకపొతే నలుపు రంగు వేడిని గ్రహిస్తుంది. కానీ తద్వారా రొమ్ము క్యాన్సర్‌కు కారణమవుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు.
అపోహ: గుడ్డులోని పచ్చసొన తినకూడదా..?
వాస్తవం: గుడ్డు పచ్చసొనలో అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుందని, అందుకే దీనిని తినకూడదని అంటారు. నిజం ఏమిటంటే ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే ఇది మంచి కొలెస్ట్రాల్. ఇందులో విటమిన్లు ఏ, ఇ , కె పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ పెరిగినవాళ్లు మాత్రమే గుడ్డులోని పచ్చసొనను తినకూడదు. మరికొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం తీసుకోకూడదు. సాధారణంగా దానిని తీసుకోవడం వల్ల ఎటువంటి హాని లేదు, ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి.
అపోహ: ఒక తెల్లవెంట్రుకను తొలగించడం వల్ల వెంట్రుకలన్నీ తెల్లగా మారతాయా..?
వాస్తవం: మీరు ఒక తెల్ల వెంట్రుకను తీస్తే, ఆ ప్రదేశంలో మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయనేది అపోహ మాత్రమే. ఒక వెంట్రుక తీసినప్పుడు ఒక ఫోలికల్ నుంచి ఒక వెంట్రుక మాత్రమే వస్తుంది. చుట్టుపక్కల ఉండే వెంట్రుకలు వాటి వర్ణద్రవ్యం కణాలు చనిపోయే వరకు తెల్ల రంగులోకి మారవు. పోషకాల లోపం కారణంగానే వెంట్రుకలు తొందరగా తెల్లబడే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. మూర్ఛవ్యాధిపై అవగాహన అవసరం..
గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
