Build Strong Muscles Naturally : కండరాల పుష్టి కోసం అద్భుతమైన 5 సూత్రాలు..!

సాక్షి లైఫ్ : జిమ్‌లో గంటల తరబడి చెమటలు చిందిస్తున్నారా..? కండరాల పుష్టి కోసం ఏమేం చేయాలి..? ఏమేం చేయకూడదు..? అనేది అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. దృఢమైన శరీరాకృతిని పొందడానికి కఠినమైన దినచర్య కంటే సరళమైన ప్రాథమిక అంశాలపై దృష్టి సారించడం ముఖ్యమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. బలమైన కండరాల కోసం వారు వెల్లడించిన ఐదు కీలక నియమాలు ఇవే..

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

1. బరువు పెంచుతూ.. సాధన చేయండి.. 

కండరాలు పెరగాలంటే వాటికి నిరంతర శ్రమ కావాలి. కేవలం బరువులు ఎత్తడం మాత్రమే కాదు, కాలక్రమేణా ఆ బరువును లేదా వ్యాయామం చేసే సమయాన్ని క్రమంగా పెంచుతూ ఉండాలి (Progressive Training). చేసే వ్యాయామంలో పురోగతి లేకపోతే కండరాల పెరుగుదల నిలిచిపోతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

2. ప్రోటీన్ మోతాదు మరువకండి.. 

కండరాల నిర్మాణానికి ప్రోటీన్ ప్రధాన ఇంధనం. సాధారణ వ్యక్తి తన శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు 1.2 నుంచి 1.6 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకోవాలి. అథ్లెట్లు అయితే 2.0 గ్రాముల వరకు తీసుకోవచ్చు. అయితే, ఈ ప్రోటీన్‌ను ఒకేసారి కాకుండా రోజంతా తీసుకునే వివిధ ఆహారాల్లో సమంగా విభజించుకుంటే శరీరానికి బాగా అందుతుంది.

3. కార్డియోలో అతి వద్దు.. 

గుండె ఆరోగ్యానికి కార్డియో వ్యాయామాలు.. పరుగు, సైక్లింగ్ వంటివి మంచివే. కానీ వాటిని అతిగా చేయడం వల్ల కండరాల పెరుగుదల కుంటుపడుతుంది. సుదూర పరుగు వంటి కఠినమైన కార్డియో వ్యాయామాలు శరీరం కోలుకోవడాన్ని నెమ్మదింపజేస్తాయి. కాబట్టి, వెయిట్ ట్రైనింగ్, కార్డియో మధ్య సరైన సమతుల్యత పాటించాలి.

4. ఉపవాసాలకు దూరంగా..

కండరాల పెరుగుదలకు శరీరానికి తగినంత శక్తి అవసరం. బరువు తగ్గాలనే ఆరాటంలో చాలా కాలం పాటు ఉపవాసం ఉండటం లేదా తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కండరాల్లో ప్రోటీన్ సంశ్లేషణ తగ్గిపోతుంది. దీనివల్ల కండరాలు బలహీనపడతాయి. వ్యాయామం చేసే వారికి సరైన పోషణ ఎంతో అవసరం.

5. నిద్రలోనే కండరాల పెరుగుదల.. 

మనం జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు కండరాలు పెరగవు. నిజానికి మనం గాఢ నిద్రలో, విశ్రాంతిగా ఉన్నప్పుడే కండరాలు వాటంతట అవే మరమ్మతు చేసుకుని పెరుగుతాయి. అందుకే ప్రతి రోజూ రాత్రి 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర కండరాల పుష్టికి అత్యంత కీలకం. వ్యాయామం ప్రారంభించే ముందు మీ శరీర తత్వానికి తగ్గట్టుగా డైట్ ప్లాన్ రూపొందించుకోవడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : muscle-growth muscles muscle-pain muscle-function muscle-strength
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com