Cause of Fatigue : యువతలో నిస్సత్తువకు కారణం ఇదే..! సరికొత్త పరిశోధనలో వెల్లడి .. 

షేర్ చేయండి:
Cause of Fatigue : యువతలో నిస్సత్తువకు కారణం ఇదే..! సరికొత్త పరిశోధనలో వెల్లడి .. 

సాక్షి లైఫ్ : ప్రస్తుత తరం యువతలో చిన్న పనికే అలసిపోవడం, దేనిమీదా ఆసక్తి లేకపోవడం వెనుక కేవలం మానసిక కారణాలే కాదు.. శరీరంలోని కణాల పనితీరులో వచ్చే మార్పులే ప్రధాన కారణమని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. డిప్రెషన్‌తో బాధపడే యువతలో ఈ 'శక్తి అసమతుల్యత' (Energy Imbalance) ఏ విధంగా ఉంటుందో వివరిస్తూ 'ట్రాన్స్‌లేషనల్ సైకియాట్రీ' జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

 

కణాల వింత ప్రవర్తన.. 

పరిశోధనలో భాగంగా 18 నుంచి 25 ఏళ్ల వయసున్న యువకుల మెదడు స్కాన్‌లు, రక్త నమూనాలను విశ్లేషించారు. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. డిప్రెషన్‌తో ఉన్నవారి కణాలు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు అవసరానికి మించి శక్తిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు లేదా మానసిక ఒత్తిడి ఎదురైనప్పుడు, అదనపు శక్తిని ఉత్పత్తి చేయడంలో ఈ కణాలు విఫలమవుతున్నాయి. ఈ వైరుధ్యం వల్లే యువతలో నిరంతర అలసట, ప్రేరణ లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పరిశోధకుడు రోజర్ వరేలా వెల్లడించారు.

ముందే గుర్తించే అవకాశం.. 

డిప్రెషన్ ప్రారంభ దశల్లో కణాలు శక్తి కోసం విపరీతంగా శ్రమిస్తాయని, ఇది భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మెదడు, రక్తప్రవాహంలో అలసటకు కారణమయ్యే అణువుల నమూనాలను నేరుగా గుర్తించడం వైద్య చరిత్రలో ఇదే మొదటిసారి అని అసోసియేట్ ప్రొఫెసర్ సుసన్నా టై పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ వైద్య రంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. డిప్రెషన్ లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం సాధ్యమవుతుంది. 

రోగి శరీరంలోని కణాల స్థితిని బట్టి, వారికి తగినట్లుగా ప్రత్యేక చికిత్సను అందించేందుకు ఈ పరిశోధన మార్గం సుగమం చేయనుంది. అలసట అనేది కేవలం శారీరక శ్రమ వల్ల వచ్చేది మాత్రమే కాదు, అది తీవ్రమైన కుంగుబాటుకు (Major Depressive Disorder) సంకేతం కూడా కావచ్చు. దీన్ని గుర్తించి సరైన సమయంలో వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.