Children Face Obesity Risk : భారత్‌లో 4.1 కోట్ల మంది చిన్నారులకు 'అధిక బరువు' గండం..! వరల్డ్ లోనే టాప్-3లో ఇండియా..
సాక్షి లైఫ్ : మన దేశంలో 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల సుమారు 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బాడీ మాస్ ఇండెక్స్ (BMI)తో బాధపడుతున్నట్లు తాజా నివేదిక స్పష్టం చేసింది. ఇందులో దాదాపు 1.4 కోట్ల మంది తీవ్రమైన ఊబకాయం (Obesity) బారిన పడ్డారు. అమెరికా, చైనాలతో కలిసి భారత్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.
ఇది కూడా చదవండి..OCD బాధితులకు సరికొత్త వైద్యం.. మెదడుకు విద్యుత్ ప్రేరణతో చికిత్స..!
ఇది కూడా చదవండి..Weight : హెల్తీ ఫుడ్ తిన్నా బరువు పెరుగుతున్నారా..? జీవక్రియల్లో దాగున్న అసలు రహస్యాలివే..!
ఇది కూడా చదవండి..Relief for women: ‘హెచ్‌పీవీ’ టీకా వేసుకుంటే మహిళలకు ఇక స్క్రీనింగ్ టెస్టులతో పని తక్కువే..!
ఆందోళన కలిగిస్తున్న ముఖ్యాంశాలు..
పెరిగిన శాతం: 1975లో కేవలం 4 శాతంగా ఉన్న పిల్లల ఊబకాయం, ప్రస్తుతం దాదాపు 20 శాతానికి చేరుకుంది. ఒకవైపు పౌష్టికాహార లోపం (Undernutrition) వేధిస్తుండగానే, మరోవైపు అధిక బరువు సమస్య దేశానికి కొత్త సవాలుగా మారింది. చరిత్రలో మొదటిసారిగా, ప్రపంచవ్యాప్తంగా తక్కువ బరువు ఉన్న పిల్లల కంటే ఊబకాయంతో బాధపడుతున్న పిల్లల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఎయిమ్స్ (AIIMS) ఎండోక్రినాలజీ విభాగానికి చెందిన డాక్టర్ రాజేష్ ఖడ్గావత్ అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం బాహ్య రూపానికి సంబంధించిన సమస్య కాదు. పిల్లల్లో శారీరక శ్రమ తగ్గడం, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. దీనివల్ల భవిష్యత్తులో చిన్న వయసులోనే మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
పరిష్కార మార్గాలు..
జంక్ ఫుడ్, అధిక చక్కెర ఉన్న పానీయాలకు పిల్లలను దూరం చేయాలి. పాఠశాలలు, ఇళ్లలో పిల్లలు ప్రతిరోజూ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ఆహార ఉత్పత్తులపై కఠినమైన నియంత్రణలు, తగిన చికిత్స సౌకర్యాలు అందుబాటులో ఉండాలి.
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
