సాక్షి లైఫ్ : ప్రజెంట్ డిజిటల్ యుగంలో ఏ చిన్న వస్తువు కొనాలన్నా గూగుల్ రేటింగ్స్ చూడటం మనకు అలవాటుగా మారింది. ముఖ్యంగా వైద్యం కోసం ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లాలన్నా.. స్టార్ రేటింగ్స్, ఆన్ లైన్ రివ్యూలు చూడాలా..? ఇప్పుడు వైద్యుల విషయంలోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. అయితే ఆ స్టార్ రేటింగ్స్ వెనుక ఉన్న అసలు వాస్తవమేంటి..? ఆన్‌లైన్ రేటింగ్స్ వైద్యుడి నైపుణ్యాన్ని కొలుస్తున్నాయా..? లేక కేవలం రోగి అనుభవాన్నే ప్రతిబింబిస్తున్నాయా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
నాణ్యతకు స్టార్సే కొలమానాలా..?
ఒకప్పుడు వైద్యుడి దగ్గరకు వెళ్లాలంటే తెలిసిన వారి సలహాలు, సిఫార్సులు తీసుకునేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో డాక్టర్ పేరు టైప్ చేయగానే 4.5 లేదా 5 రేటింగ్ కనిపిస్తోంది. ఇది రోగులకు కొంత భరోసానిచ్చినప్పటికీ, వైద్యరంగ నిపుణులు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం అనేది ఒక హోటల్ సర్వీసో లేక డెలివరీ యాపో కాదు, అది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. ఆన్‌లైన్ రివ్యూలు కేవలం హాస్పిటల్ వాతావరణం, వెయిటింగ్ టైమ్ వంటి సౌకర్యాల గురించి చెబుతాయే తప్ప, డాక్టర్ చేసే చికిత్సా పద్ధతిని (Clinical Skill) అంచనా వేయలేవు.
రేటింగ్స్ వెనుక ఉన్నఅసలు నిజాలు..
ఆన్‌లైన్ రేటింగ్స్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కోపంతో లేదా వ్యక్తిగత కక్షతో చేసే కొన్ని తప్పుడు రివ్యూలు డాక్టర్ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న పేరును ఒక్క నిమిషంలో దెబ్బతీస్తున్నాయి.
అత్యంత క్లిష్టమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు చికిత్స చేసేటప్పుడు ఫలితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకే రకమైన సర్జరీ ఇద్దరు వ్యక్తులకు చేసినా, వారి శరీర తత్వాన్ని బట్టి కోలుకునే విధానం మారుతుంది. తక్కువ రేటింగ్ వస్తుందనే భయంతో వైద్యులు రిస్క్ ఉన్న కేసులను తీసుకోవడానికి వెనుకాడే ప్రమాదం ఉంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రద్దీ, సిబ్బంది కొరత వంటి కారణాల వల్ల రోగులు అసంతృప్తికి లోనవుతారు. కానీ ఆ అసహనాన్ని డాక్టర్ వ్యక్తిగత నైపుణ్యంతో ముడిపెట్టి రేటింగ్ ఇవ్వడం సరికాదు.
రోగులు గమనించాల్సింది..
వైద్యుడిని ఎంచుకునేటప్పుడు ఆన్‌లైన్ రేటింగ్స్‌ను ఒక ప్రాథమిక సమాచారంగా మాత్రమే చూడాలి. డాక్టర్ అనుభవం, వారు చేసే చికిత్సపై ఉన్న అవగాహన, తోటి రోగుల ప్రత్యక్ష అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. డిజిటల్ రేటింగ్స్ పారదర్శకతను పెంచుతున్నప్పటికీ, అవి వైద్యుడి అర్హతకు పూర్తి స్థాయి సర్టిఫికేట్లు కావని గుర్తించాలి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com