Passive Smoking Puts Children’s Lives at Risk : తాగేది మీరు.. పీల్చేది వారు.. పరోక్ష ధూమపానంతో చిన్నారులకు ప్రాణపాయం..!
సాక్షి లైఫ్ : ఒత్తిడి తగ్గించుకోవడానికో.. సరదాకో మొదలుపెట్టే ధూమపానం, చివరకు ప్రాణాల మీదకు తెస్తోంది. సిగరెట్ పొగ కేవలం ఊపిరితిత్తులనే కాకుండా, మనిషిని నిలువునా దహించివేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల నుంచి కాలి గోరు వరకు ప్రతి అవయవంపై ధూమపానం తీవ్ర ప్రభావం చూపుతుందని పల్మనాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఒక్క సిగరెట్ పొగలో 7 వేల రసాయనాల విషవలయం..
మనం పీల్చే ఒక్క సిగరెట్ పొగలో ఏకంగా 7,000 పైగా ప్రమాదకర రసాయనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి నేరుగా రక్తంలో కలిసి శరీరమంతా ప్రవహిస్తాయి. దీనివల్ల కణాలలోని DNA దెబ్బతినడమే కాకుండా, అంతర్గత వాపు (Inflammation), ఆక్సీకరణ ఒత్తిడి (Oxidative Stress) పెరుగుతాయి.
శ్వాసకోశ సమస్యలు..
దీర్ఘకాలికంగా పొగతాగడం వల్ల బ్రాంకైటిస్, ఎంఫిసెమా, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని దెబ్బతీసే COPD వంటి వ్యాధులు దరిచేరుతాయి. కేవలం ఊపిరితిత్తులే కాకుండా నోరు, గొంతు, మూత్రాశయ క్యాన్సర్లకు ఇది ప్రధాన కారణం. ధూమపానం వల్ల రక్తనాళాలు సంకోచించి, రక్తపోటు పెరుగుతుంది. రక్తం గడ్డకట్టే గుణం పెరగడం వల్ల గుండెపోటు (Heart Attack), పక్షవాతం (Stroke) ముప్పు పొంచి ఉంటుంది.
ధూమపానం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతాయి. పురుషులలో లైంగిక బలహీనత, వంధ్యత్వానికి కారణమవుతుంది. గర్భవతులు పొగతాగడం వల్ల పుట్టబోయే బిడ్డలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
కుటుంబసభ్యులందరికీ ముప్పే..!
పొగతాగే వ్యక్తితో పాటు ఆ పొగను పీల్చే కుటుంబ సభ్యులు కూడా ప్రమాదంలో పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులకు దీనివల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. ధూమపానం మానడమే అసలైన పరిష్కార మార్గం. ఒక్కసారి ఆ అలవాటు నుంచి బయటపడితే, మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
