Malaria Symptoms and Prevention : మలేరియా లక్షణాలు.. తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు..
సాక్షి లైఫ్ : మలేరియా లేదా ఇతర అనుబంధ ఇన్ఫెక్షన్ల బారిన పడినప్పుడు శరీరం అనేక అసౌకర్యాలకు లోనవుతుంది. ముఖ్యంగా అధిక జ్వరంతో పాటు వణుకు పుట్టించే చలి, విపరీతమైన చెమటలు పట్టడం ఈ వ్యాధి ప్రధాన సంకేతాలు. వీటితో తోడుగా తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు బాధిస్తాయి. జీర్ణవ్యవస్థపై కూడా దీని ప్రభావం ఉంటుంది. తద్వారా వికారం, వాంతులు, ఆకలి పూర్తిగా మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగినప్పుడు కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారే కామెర్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలి.
ఇది కూడా చదవండి..Ban Paraquat : ప్రాణాంతక గడ్డి మందు "పారాక్వాట్" ను నిషేధించాల్సిందే..! : వైద్య నిపుణులు
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
నివారణే ఉత్తమ మార్గం..
ఈ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి నివారణే ఉత్తమ మార్గం. నిద్రించే సమయంలో దోమతెరలను తప్పనిసరిగా వాడాలి.శరీరాన్ని పూర్తిగా కప్పేలా ఉండే పొడవైన చేతుల దుస్తులను ధరించడం శ్రేయస్కరం. మన ఇంటి చుట్టుపక్కల, కుండీల్లో లేదా పాత సామాన్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా దోమల సంతతిని అరికట్టవచ్చు.
తొలిదశలోనే గుర్తించి..
అన్నిటికంటే ముఖ్యంగా, జ్వరం వచ్చిన వెంటనే సొంత వైద్యం లేదా యాంటీబయాటిక్స్ వాడటం మానుకోవాలి. వెంటనే అనుభవజ్ఞుడైన వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించు కోవడం ద్వారా వ్యాధిని తొలిదశలోనే గుర్తించి క్షేమంగా బయటపడవచ్చు. జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి, రక్త పరీక్షలు చేయించుకోవడమే ఉత్తమం. ఆలస్యంగా గుర్తించడం వల్ల చికిత్స మందగించి పరిస్థితి విషమించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
