Artificially Colored Watermelon : పుచ్చకాయ కొంటున్నారా..? బీ కేర్ ఫుల్..! అది రంగు పూసిన 'విషం' కావచ్చు..!
సాక్షి లైఫ్ : వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడం కోసం పుచ్చకాయ తింటున్నారా..? అయితే ఒక్క నిమిషం.. మీరు తింటున్న పండు సహజ సిద్ధంగా పండినదేనా..? లేక రసాయనాలతో పండిన అన్నది సరిచూసుకోండి. ఇటీవల ముంబైలో పుచ్చకాయ తిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం అందరినీ హడలించేస్తోంది. అసలు మంచి పుచ్చకాయను ఎలా గురించాలి..? కల్తీని ఎలా కనుగొనాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
త్వరగా పండటానికి..
సాధారణంగా పుచ్చకాయలు త్వరగా పండటానికి, లోపల ఎర్రగా కనిపించడానికి కొందరు వ్యాపారులు 'ఎరిత్రోసిన్', 'కార్బైడ్' వంటి ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తున్నారు. ఇవి శరీరంలోకి చేరితే కింది సమస్యలు తప్పవు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పికి దారితీస్తుంది. రసాయనాలతో పండించిన పండ్లు కాలేయం (Liver), మూత్రపిండాల (Kidneys) పనితీరును దెబ్బతీస్తాయి. డీహైడ్రేషన్.. ఇన్ఫెక్షన్ల వల్ల శరీరం త్వరగా నీటిని కోల్పోయి నీరసించిపోతారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో ఇది ప్రాణాంతకం కావచ్చు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
అసలైన పండును గుర్తించడం ఎలా..?
కల్తీ పండ్ల మాయలో పడకుండా ఉండాలంటే కొనుగోలు చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి. పుచ్చకాయ నేలపై పండినప్పుడు, నేలకు తగిలే భాగంలో పసుపు రంగు మచ్చ ఉంటుంది. అది తెల్లగా లేదా పసుపు రంగులో ఉంటే సహజంగా పండినట్లు లెక్క. అసలు మచ్చ లేకపోతే అది కెమికల్స్ ద్వారా పడినట్లుగానే భావించాలి.
శబ్దాన్ని గమనించండి..
కాయను చేత్తో తట్టినప్పుడు ‘డబ్ డబ్’ అని బోలుగా (Hollow Sound) శబ్దం రావాలి. లోపల ఖాళీగా ఉన్నట్లు శబ్దం వస్తే అది పండినట్లు అర్థం.
రంగు విషయంలో మోసం..
పుచ్చకాయ కోసిన తర్వాత లోపల మరీ అతి ఎరుపు రంగులో ఉండి, గింజల చుట్టూ రంగు విడిపోతున్నట్లు ఉంటే రసాయన ఇంజెక్షన్లు ఇచ్చారని అనుమానించాలి. పండు పైన మరీ నునుపుగా, విపరీతమైన మెరుపుతో ఉంటే అది సహజం కాదు. ప్రకృతి సిద్ధంగా పెరిగిన పండుపై రంగు కొంచెం మందకొడిగా (Dull) ఉంటుంది.
తినే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
పుచ్చకాయను కోయడానికి ముందు కనీసం గంట సేపు నీటిలో ఉంచి, బయట భాగం బాగా కడిగి ఆ తర్వాతే కోయాలి. రోడ్డు పక్కన కోసి ఉంచిన ముక్కలను అస్సలు కొనవద్దు. వాటిపై బ్యాక్టీరియా వేగంగా చేరుతుంది. పండు కోసిన తర్వాత ఎక్కువ సేపు నిల్వ ఉంచకూడదు. ఫ్రిజ్‌లో పెట్టినప్పటికీ వీలైనంత త్వరగా తినేయడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
