Vitamin B12 Deficiency : అలసటకు విటమిన్ 'బి12' కి లింక్ ఏంటి..?  

షేర్ చేయండి:
Vitamin B12 Deficiency : అలసటకు విటమిన్ 'బి12' కి లింక్ ఏంటి..?  

సాక్షి లైఫ్ : మీకు తరచుగా నీరసంగా అనిపిస్తోందా..? చిన్న పనికే ఆయాసం వస్తుందా..? అయితే మీ శరీరంలో విటమిన్ బి12 లోపించిందేమో పరీక్షించుకోండి. మన శరీరంలో ఎర్ర రక్త కణాల తయారీ నుంచి మెదడు పనితీరు వరకు అన్నింటిలోనూ ఈ విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలామంది ఈ లోపంతో బాధపడుతున్నారని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

బి12 ఎందుకు అవసరం..?

విటమిన్ బి12 అనేది నీటిలో కరిగే విటమిన్. ఇది మన శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇది అత్యంత అవసరం. దీని లోపం వల్ల 'మెగాలోబ్లాస్టిక్ అనీమియా' అనే రక్తహీనత సమస్య తలెత్తుతుంది. నరాల చుట్టూ ఉండే రక్షణ కవచం దెబ్బతినకుండా చూస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ఇది సహాయపడుతుంది.

లోపాన్ని గుర్తించడం ఎలా..?  

శరీరంలో బి12 స్థాయిలు తగ్గినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.

విపరీతమైన అలసట, నీరసం, కళ్లు తిరగడం.

చేతులు, కాళ్లలో తిమ్మిర్లు లేదా సూదులతో గుచ్చినట్లు అనిపించడం.

నాలుక ఎర్రగా మారడం లేదా నోటి పూత.

మతిమరుపు, ఏకాగ్రత లోపించడం,మానసిక ఆందోళన.

చర్మం పాలిపోయినట్లు (Pale skin) కనిపించడం.

 ముప్పు ఎవరికి ఎక్కువ..?

ముఖ్యంగా శాఖాహారుల్లో ఈ విటమిన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే బి12 సహజంగా జంతు సంబంధిత ఆహారంలోనే లభిస్తుంది. అలాగే వయసు పైబడిన వారు, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఈ విటమిన్ శోషణ తక్కువగా ఉంటుంది.

ఆహారంలో వీటిని చేర్చుకోండి..

మీ బి12 స్థాయిలను మెరుగుపరుచుకోవడానికి పలురకాల ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి. పాలు, పెరుగు, వెన్న,పనీర్‌లో బి12 సమృద్ధిగా ఉంటుంది. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శాకాహారానికి దగ్గరగా ఉండేవారు గుడ్లు తీసుకోవడం ద్వారా ఈ విటమిన్‌ను పొందవచ్చు.

 చేపలు, చికెన్, కాలేయం (Liver) వంటి మాంసాహార పదార్థాల్లో ఇది అధిక మొత్తంలో లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో బి12 కలిపిన తృణధాన్యాలు (Cereals), సోయా పాలు లభిస్తున్నాయి. కొన్ని రకాల పుట్టగొడుగుల్లోనూ స్వల్ప మోతాదులో బి12 లభిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు సొంతంగా విటమిన్ టాబ్లెట్లు వాడకూడదు. వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలి. అవసరమైతే వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు లేదా ఇంజెక్షన్లు తీసుకోవడం ఉత్తమం.

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.