Ayurvedic tips : జలుబు, దగ్గును తరిమికొట్టే ఆయుర్వేద కషాయం.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వాతావరణం మారినప్పుడల్లా జలుబు, దగ్గు, గొంతులో గరగర వంటి సమస్యలు వేధించడం సహజం. వానాకాలం, చలికాలంలో ఇవి మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే మందుల షాపుల వైపు పరుగులు తీయకుండా.. మన వంటగదిలో ఉండే సహజసిద్ధమైన దినుసులతో తయారుచేసే 'ఆయుర్వేద కషాయం' తాగితే అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేదంలో కషాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, ఇది శాశ్వత నివారణ కాకపోయినా, సాధారణ జలుబు, దగ్గు నుంచి తక్షణ ఉపశమనం కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఆ కషాయాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

 

కషాయం తయారీకి కావాల్సిన పదార్థాలు:

నీళ్లు - 1 గ్లాసు

తులసి ఆకులు - 5 నుంచి 6

అల్లం - ఒక అంగుళం ముక్కను మెత్తగా దంచుకోవాలి. 

మిరియాలు - 2 లేదా 3

దాల్చినచెక్క - ఒక చిన్న ముక్క

లవంగాలు - 2

తేనె - ఒక చెంచా (రుచికి సరిపడా)

తయారీ విధానం..

ముందుగా స్టవ్‌పై ఒక గిన్నె పెట్టి అందులో గ్లాసు నీళ్లు పోసి వేడి చేయాలి.

నీళ్లు కాస్త వేడెక్కాక అందులో తులసి ఆకులు, దంచిన అల్లం, మిరియాలు, దాల్చినచెక్క, లవంగాలు వేయాలి.

సన్నని మంటపై ఈ మిశ్రమాన్ని బాగా మరిగించాలి.

పోసిన నీళ్లు సగం అయ్యేంత వరకు అంటే డికాక్షన్ లాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేయాలి.

ఈ మిశ్రమాన్ని వడకట్టుకుని, కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఒక చెంచా తేనె కలుపుకొని తాగాలి.

ఈ కషాయం తాగడం వల్ల కలిగే 5 అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు..

1. జలుబు, ముక్కుదిబ్బడకు చెక్.. 

కషాయంలో ఉపయోగించే అల్లం, ఇతర మసాలా దినుసులు శ్వాసనాళాలను శుభ్రం చేసి, ముక్కుదిబ్బడను తగ్గిస్తాయి.

2. గొంతుకు ఎంతో హాయి..

గొంతులో గరగర, మంట, పొడి దగ్గుతో బాధపడేవారికి ఈ వేడివేడి కషాయం ఎంతో సాంత్వన చేకూరుస్తుంది. గొంతు వాపును తగ్గిస్తుంది.

3. శరీరానికి వెచ్చదనం.. 

చల్లటి వాతావరణంలో ఈ కషాయం తాగడం వల్ల శరీరానికి లోపలి నుంచి కావాల్సిన వెచ్చదనం అందుతుంది. చలి తీవ్రత నుంచి రక్షణ కల్పిస్తుంది.

4. రోగనిరోధక శక్తి..

తులసి ఆకులు, మిరియాలు, దాల్చినచెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయి.

5. సాఫీగా జీర్ణక్రియ..

అల్లం, దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తాయి.

తప్పక గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు..  

కషాయం ఆరోగ్యానికి మంచిదే కదా అని మోతాదుకు మించి అతిగా తాగకూడదు.

మసాలా దినుసులు ఎక్కువగా వేస్తే కడుపులో మంట, అల్సర్ల వంటి సమస్యలు రావచ్చు.

వేడి వేడిగా మరుగుతున్న కషాయంలో ఎప్పుడూ తేనెను కలపకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి.

చిన్నపిల్లలు, గర్భిణులు, లేదా ఏదైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు దీన్ని తీసుకునే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించడం మంచిది.

 

ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.