సిద్ధ వైద్యం అంటే తెలుసా..?

సాక్షి లైఫ్ : సిద్ధ వైద్యం అనేది దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పురాతన వైద్య విధానం. ఇది ఇప్పటివరకు కొన్ని ప్రాంతాలవరకే పరిమితం అయ్యింది.  ఈ విధానం ప్రభావవంతంగా పనిచేయడంతో దీనికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆదరణపెరుగుతోంది. సిద్ధవైద్యానికి సంబంధించిన సాహిత్యం అనేది తమిళంలో ఉండడంతో భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో, విదేశాలలో చికిత్స పొందడంలో ఇబ్బంది ఏర్పడింది. కానీ ఇప్పుడు ఈ వైద్య విధానం గురించిన పుస్తకాలు హిందీ, ఇంగ్లీషుతో సహా అనేక భాషలలోకి అనువదించడంతో నెమ్మదిగా దీని ప్రాబల్యం పెరుగుతోంది.

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

సిద్ధ వైద్యం అంటే ఏమిటి..? మూలికలు, మూలికా ఖనిజాలు మొదలైన వాటి సహాయంతో, సోరియాసిస్, ఎగ్జిమా, అలోపేసియా, డయాబెటిస్, అల్సర్, మొటిమలు, బొల్లి, పెమ్ఫిగస్ పాంఫాలిక్స్, లెప్రసీ వంటి అనేక అరుదైన వ్యాధులకు సిద్ధ వైద్య విధానం ద్వారా చికిత్స అందిస్తారు.

సురక్షితమైన వైద్యం..  

సిద్ధ వైద్యంలో పద్దెనిమిది సిద్ధులు ముఖ్యమైనవి. అగస్త్యుడు సిద్ధ వైద్య స్థాపకుడిగా పరిగణిస్తారు. సిద్ధ ఔషధం వ్యాధి కారణంగా క్రియారహితంగా ఉన్న అవయవాలను పునరుజ్జీవింపజేస్తుంది. త్రిదోష సమతుల్య నిష్పత్తిని నిర్వహించడంలో సహాయపడుతుంది. కరోనా చికిత్సలో సిద్ధ చికిత్స కూడా ప్రభావవంతమైనది. 

అనేక వ్యాధులకు చికిత్స..

సోరియాసిస్, ఎగ్జిమా, అలోపేసియా, డయాబెటిస్, అల్సర్, మొటిమలు, బొల్లి, పెమ్ఫిగస్, పాంఫాలిక్స్, లెప్రసీ వంటి అనేక  అరుదైన వ్యాధులకు మూలికలు, మూలికా ఖనిజాలు మొదలైన వాటి ద్వారా సిద్ధ వైద్యం సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్సను అందిస్తుంది. అనేక తీవ్రమైన వ్యాధులను సైతం సిద్ధ వైద్యం సహాయంతో నయం చేయవచ్చు. ఈ పద్ధతి చికిత్సతో పాటు మంచి జీవనశైలి ప్రాముఖ్యతను గురించి చెబుతుంది. అంటే, చికిత్సతో పాటు, జీవనశైలిలో కావలసిన మార్పులు చేస్తే, అది సానుకూల, ఆశించిన ఫలితాలను ఇస్తుంది. 

సిద్ధ వైద్యంలో ఉపయోగించే ఔషధాలు వ్యక్తి ఆరోగ్య స్థితి, అతని స్వభావంపై ఆధారపడి ఉంటాయి. అంటే వ్యక్తి  శారీరక , మానసిక స్థితిని బట్టి మందులు అందిస్తారు. ఈ మందులు కూడా తక్కువ ధరలకే  అందుబాటులో ఉంటాయి.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ (ఎన్ఐసి) చెన్నైలో ఉన్న సిద్ధ ఔషధం ప్రధాన సంస్థ. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం సిద్ధ వైద్య విధానం కోసం పరిశోధన, ఉన్నత చదువులకు సౌకర్యాలు కల్పించడం. ఈ సిద్ధవైద్య విధానానికి  ప్రపంచ గుర్తింపు తీసుకురాడంలో, ఈ వ్యవస్థకు ప్రాచుర్యం కల్పించడంలో ఇటువంటి సంస్థలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.

   ఇది కూడా చదవండి.. ఎండాకాలంలో వీటిని తప్పనిసరిగా నివారించాలి..


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను

Tags : women-health mental-health kids-health diabetes kids-health-care heart kids-ear-infections siddha-medicine siddha-treatment siddha-medicine-uses

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com