Drinking Water : నీళ్లు ఏ సమయంలో తాగాలి..? ఆరోగ్య రహస్యాలు ఇవే..!
సాక్షి లైఫ్ : మన శరీర సాధారణ పనితీరుకు నీరు అత్యంత కీలకం. రోజూ తగిన మోతాదులో నీరు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే, చాలా మందికి నీరు ఎప్పుడూ తాగాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఉండదు. ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం మంచిదా..? భోజనం మధ్యలో లేదా తర్వాత తాగవచ్చా..? అనే అనేక సందేహాలు నిత్యం వ్యక్తమవుతుంటాయి. నీటి వినియోగానికి సంబంధించి కొన్ని శాస్త్రీయ విషయాలు, తగిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
నీరు తాగే సరైన సమయం ఏది..?
ప్రతి ఒక్కరికీ ఇదే సరైన సమయమని నిర్దిష్టంగా చెప్పలేము. వయసు, వాతావరణం, శారీరక శ్రమ, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యాన్ని బట్టి శరీరానికి అవసరమైన నీటి పరిమాణం మారుతుంటుంది. అయితే కొన్ని ప్రత్యేక సమయాల్లో నీరు తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయం నిద్రలేచాక..రాత్రి సమయంలో చాలా గంటల పాటు నీరు తీసుకోకపోవడం వల్ల శరీరంలో కొద్దిగా నీటి నిల్వలు తగ్గుతాయి. ఉదయం నిద్రలేచాక నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది.
భోజనానికి ముందు..భోజనానికి ముందు తగినంత నీరు తాగడం శరీరానికి మంచిది. అయితే ప్రతి ఒక్కరూ భోజనానికి ముందే తాగాలని నిబంధనేమీ లేదు. భోజనం చేసే సమయంలో.. సాధారణంగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు భోజనంతో పాటు నీరు తీసుకోవడంలో ఎటువంటి సమస్య లేదు. 'నీరు తాగితే జీర్ణక్రియ దెబ్బతింటుంది' అనే వాదన శాస్త్రీయంగా సరైనది కాదు.
వ్యాయామానికి ముందు, ఆ తర్వాత.. వ్యాయామం చేసేటప్పుడు లేదా శారీరక శ్రమ వల్ల చెమ రూపంలో నీరు కోల్పోతాము. కాబట్టి వ్యాయామానికి ముందు, ఆ సమయంలో, ఆ తర్వాత అవసరానికి తగినట్లుగా నీరు తాగాలి. ఎక్కువ చెమట పట్టినప్పుడు ఎలక్ట్రోలైట్లు ఉన్న పానీయాలు కూడా ఉపయోగపడతాయి.
నిద్రపోయే ముందు.. పడుకునే ముందే ఎక్కువ నీరు తాగితే రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుంది. అందుకే పడుకునే ముందు తక్కువ మోతాదులో నీరు తీసుకోవడం మంచిది.
రోజువారీగా ఎంత నీరు అవసరం..?
ప్రతి వ్యక్తికి ఒకే రకమైన మోతాదు వర్తించదు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, ఎక్కువ చెమట పట్టినప్పుడు, లేదా అనారోగ్య సమయాల్లో శరీర్ ద్రవ పదార్థాలను ఎక్కువగా కోరుకుంటుంది. దాహం వేయడం అనేది శరీరం నీటిని కోరుకుంటోందనే దానికి ప్రధాన సంకేతం. అయితే, గుండె లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు మాత్రమే ద్రవ పదార్థాల తీసుకోవడంపై నియంత్రణ పాటించాలి.
అధికంగా నీరు తాగడం కూడా ప్రమాదమే..
శరీరానికి నీరు ఎంత అవసరమో, మోతాదుకు మించి అతిగా తాగడం కూడా ఆరోగ్యానికి హానికరమే. అవసరానికి మించి విపరీతంగా నీరు తాగడం వల్ల రక్తంలో సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. దీనినే 'హైపోనాట్రేమియా' (Hyponatremia) అంటారు. కాబట్టి బలవంతంగా ఎక్కువ నీరు తాగడం కంటే, మీ శరీర తత్వాన్ని బట్టి తగిన మోతాదులో తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
