వేసవి సీజన్ లో మట్టి కుండ నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?  

సాక్షి లైఫ్ : వేసవి సీజన్ లో ఎండలు మండిపోతున్న సమయంలో మట్టి కుండలో నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పురాతన కాలం నుంచి భారతదేశంలో గృహాల్లో మట్టి కుండలను నీటిని చల్లగా ఉంచడానికి ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సాంప్రదాయ పద్ధతి కేవలం నీటిని చల్లగా ఉంచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

 

ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?

ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?

 

మట్టి కుండ నీరు - ఆరోగ్య ప్రయోజనాలు.. 

సహజ శీతలీకరణ : మట్టి కుండల ఉపరితలంపై ఉండే సూక్ష్మ రంధ్రాల ద్వారా నీరు ఆవిరై, సహజంగా చల్లబడుతుంది. ఈ నీరు రిఫ్రిజిరేటర్ నీటిలా అతి చల్లగా ఉండదు, కాబట్టి ఇవి తాగినా జలుబు లేదా గొంతు నొప్పి వంటివి రావు.

 జీర్ణ సమస్యలు తలెత్తవు : మట్టి క్షార స్వభావం కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని ఆమ్లాన్ని సమతుల్యం చేస్తుంది, దీనివల్ల ఆమ్లత్వం ,జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

సహజ శుద్ధీకరణ : మట్టి కుండల సూక్ష్మ రంధ్రాలు నీటిలోని కలుషితాలను ఫిల్టర్ చేస్తాయి, నీటిని స్వచ్ఛంగా, సురక్షితంగా చేస్తాయి.

సన్‌స్ట్రోక్ నివారణ : వేసవిలో సన్‌స్ట్రోక్, డీహైడ్రేషన్ సమస్యలను నివారించడానికి మట్టి కుండ నీరు సహాయపడుతుంది, ఎందుకంటే ఇది ఖనిజాలు, పోషకాలను కాపాడుతుంది.

పర్యావరణ హితం: ప్లాస్టిక్ బాటిల్స్‌లోని బిస్ఫెనాల్ ఎ (బీపీఏ) వంటి హానికర రసాయనాలకు బదులుగా, మట్టి కుండలు పర్యావరణానికి హాని కలిగించవు.  

జాగ్రత్తలు.. 

మట్టి కుండను ప్రతి 2-3 రోజులకు ఓసారి శుభ్రం చేయాలి. ఎప్పటికప్పుడు కడిగి తాజా నీటిని నింపాలి.

కడిగేటప్పుడు సబ్బు లేదా డిటర్జెంట్ ఉపయోగించకుండా, వేడి నీటితో, గట్టి బ్రష్‌తో శుభ్రం చేయాలి, ఎందుకంటే సబ్బు మట్టిలో చేరి నీటిని కలుషితం చేయవచ్చు.

 మట్టి కుండ నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వేసవిలో ఆరోగ్యకరమైన ఎంపిక," అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : summer-health-tips summer-season summer dehydration summer-health summer-drnks summer-tips summer-alert clay-pot-water clay-bottles summer-heat clay-pots over-hydration hydration-levels
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com