Myths and Facts : కళ్లద్దాలు రెగ్యులర్‌గా పెట్టుకుంటే కంటి పవర్ నిజంగా పెరుగుతుందా..? ఎంతవరకు నిజం..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అద్దాలు వాడటం మానేస్తే కంటి సైట్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతుందా? కాంటాక్ట్ లెన్స్ వాడటం వల్ల కంటి పవర్‌ను శాశ్వతంగా తగ్గించవచ్చా, అలాగే ఒకసారి రీడింగ్ గ్లాసెస్ వాడటం మొదలుపెడితే జీవితాంతం వాడాల్సిందేనా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. వీటితో పాటు, చిన్న వయసులోనే పిల్లలకు అద్దాలు పెట్టడం వల్ల కళ్లు మరింత బలహీనపడతాయా, టీవీని దగ్గరగా కూర్చుని చూడటం వల్లే పిల్లలకు సైట్ వస్తోందా, కళ్లను బలంగా నలపడం లేదా రుద్దడం వల్ల కంటి పవర్ మారే అవకాశం ఉందా అనే ప్రశ్నలు కూడా తరచూ వినిపిస్తుంటాయి.

మరోవైపు, చీకట్లో మొబైల్ చూడటం వల్ల కంటి చూపు శాశ్వతంగా పోతుందా, లేదా ఎక్కువ సేపు కంప్యూటర్ చూస్తే కళ్లలో నీళ్లు ఎందుకు తిరుగుతాయి అనే డిజిటల్ స్క్రీన్ అలవాట్లపై కూడా ప్రజల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. అలాగే క్యారెట్లు, ఆకుకూరలు ఎక్కువగా తింటే అద్దాలతో పని లేకుండా సైట్ పూర్తిగా తగ్గిపోతుందా, ప్రతిరోజూ కళ్లను చల్లటి నీటితో కడగడం వల్ల సైట్ రాకుండా ఆపవచ్చా..?

 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

 

విటమిన్ ఎ లోపం ఉంటేనే కంటి చూపు మందగిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వీటన్నింటికీ తోడు, కంటి సైట్‌ను శాశ్వతంగా పోగొట్టే 'లాసిక్ (LASIK)' సర్జరీ ఏ వయసు వారు చేయించుకోవాలి, లేజర్ ఐ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్లీ కంటి పవర్ పెరిగే ఛాన్స్ ఉందా..? కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి హోం రెమెడీస్ నిజంగా పనిచేస్తాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆప్తమాలజిస్ట్ డా. శ్రీలక్ష్మి నిమ్మగడ్డ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..