Weight loss : తిండి తగ్గించినా బరువు తగ్గట్లేదా..? ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చూసుకోండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బరువు తగ్గాలని నిర్ణయించుకోగానే చాలామంది చేసే మొదటి పని ఆహారాన్ని బాగా తగ్గించేయడం. రాత్రి భోజనం మానేయడం, అతి తక్కువ కేలరీలు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. అయినప్పటికీ కొందరిలో బరువు ఇసుమంతైనా తగ్గదు. శరీర బరువు కేవలం తినే ఆహారంపైనే కాకుండా నిద్ర, హార్మోన్లు, శారీరక శ్రమ, జీవక్రియల (metabolic function) పనితీరుపై కూడా ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

ఆహారం తగ్గించినా బరువు తగ్గకపోవడానికి ప్రధాన కారణాలు..


శరీరానికి సరైన విశ్రాంతి లేకపోతే బరువు తగ్గడం అసాధ్యం. రోజుకు 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. నిద్ర తగినంత లేనప్పుడు ఆకలిని ప్రేరేపించే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా అధిక కేలరీలు ఉండే జంక్ ఫుడ్ తినాలనే కోరిక పెరుగుతుంది. నిద్రలేమి రక్తపోటు, షుగర్ స్థాయిలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఇన్సులిన్ రెసిస్టెన్స్..

మనం తీసుకున్న ఆహారం ద్వారా లభించే గ్లూకోజ్‌ను కణాలకు చేర్చడంలో ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది. కణాలు ఈ ఇన్సులిన్‌కు సరైన రీతిలో స్పందించనప్పుడు దానిని 'ఇన్సులిన్ రెసిస్టెన్స్' అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు శరీరం కొవ్వును కరిగించలేక, నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి, బరువు తగ్గకపోవడానికి ఇది ప్రధాన కారణం.

ప్రొటీన్ లోపం - కండరాల క్షీణత..

కేలరీలు తగ్గించే క్రమంలో చాలామంది శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను పట్టించుకోరు. ఆహారంలో తగినంత ప్రొటీన్ లేకపోతే కొవ్వు కంటే ముందే కండరాల సాంద్రత తగ్గిపోతుంది. దీనివల్ల జీవక్రియల వేగం మందగించి, శరీర శక్తి ఖర్చయ్యే సామర్థ్యం పడిపోతుంది. వైద్య సమస్యలు, మందులు, కొన్ని రకాల వ్యాధులు బరువు తగ్గే ప్రక్రియకు అడ్డుపడతాయి. థైరాయిడ్ సమస్యలు, పీసీఓఎస్ (PCOS) లేదా ఇతర హార్మోన్ల అసమతుల్యత. 

మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్‌కు వాడే కొన్ని మందులు..

మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్‌కు వాడే కొన్ని మందులు..కేవలం ఆకలితో ఉండడం వల్ల బరువు తగ్గలేరు. సరైన పోషకాలున్న సమతుల్యాహారం, క్రమం తప్పని వ్యాయామం, కనీసం 7-8 గంటల నిద్ర అత్యంత ముఖ్యం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోతే సొంత ప్రయోగాలు ఆపి, వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు, థైరాయిడ్, హార్మోన్ల స్థాయిలను తనిఖీ చేయించుకోవడం శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.