విటమిన్ B1లోపంతో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి..? వాటిని ఎలా అధిగమించాలి..? 

సాక్షి లైఫ్ : ఆహారంలో పోషకాలు సమృద్ధిగా తీసుకుంటే..ఆయా ఆహారం అనేక రకాల తీవ్రమైన వ్యాధుల నుంచి సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే ఆకు కూరలు, సీజనల్ పండ్లను ప్రతిరోజూ తినాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. సాధారణంగా పోషకాహారం విషయానికి వస్తే, విటమిన్ "సి", "డి"తో పాటు ప్రోటీన్ వంటివి ప్రతి ఒక్కరికీ అవసరం. అయితే విటమిన్ "బి1" కూడా మన శరీరానికి ఇతర పోషకాల వలె చాలా ముఖ్యమైనది.

నరాలు, కండరాలు, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ బి-1 ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. విటమిన్ B1ని థయామిన్ అని కూడా అంటారు. మన శరీరంలో గ్లూకోజ్ జీవక్రియకు, నరాలు, కండరాల పనితీరును సులభతరం చేయడానికి ఇది చాలా అవసరం. శరీరంలో దీని లోపం అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. విటమిన్ B-1 ఎందుకు ముఖ్యమైనదో ,దాని లోపం వల్ల ఏయే సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..?

 నీటిలో కరిగే విటమిన్.. 

విటమిన్ B1 లేదా థయామిన్ అనేది నీటిలో కరిగే విటమిన్, ఇది శరీరం కార్బోహైడ్రేట్‌లను శక్తిగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. విటమిన్ B1 లోపం సాధారణంగా బెరిబెరి వ్యాధికి కారణమవుతుంది. అంతేకాదు నరాల సంబంధిత రుగ్మతలు కూడా పెంచుతుంది. 

ఇది కాకుండా, విటమిన్ B1లోపిస్తే బరువు తగ్గడం, అనోరెక్సియా సమస్య తలెత్తుతుంది. తీవ్రమైన సందర్భాల్లో గందరగోళం, జ్ఞాపకశక్తి సమస్యలు కూడా సంభవించవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

ఆహారంలో కొన్ని అంశాలను చేర్చుకోవడం ద్వారా విటమిన్ బి1ను పొందవచ్చు. అటువంటి వాటిలో సన్ ఫ్లవర్ సీడ్స్ చాలా ముఖ్యమైనవి. పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ బి1 తగినంత మొత్తంలో ఉంటుంది. 100 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాలలో 0.106 mg విటమిన్ B1 పొందవచ్చు. 

పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్లు B2, B3, B6, C, E అండ్ K వంటి అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. సన్ ఫ్లవర్ సీడ్స్  అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. విటమిన్ B-1 అవసరాలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా తీర్చవచ్చు.

పచ్చి బఠానీలో.. 

100 గ్రాముల పచ్చి బఠానీలలో 0.282 mg విటమిన్ B1 ఉంటుంది. ఇవి  కాకుండా  కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. పచ్చి బఠానీలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా థయామిన్ (విటమిన్ B1) పుష్కలంగా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


థయామిన్ సహజంగా మాంసం, చేపలు, తృణధాన్యాలలో లభిస్తుంది. థయామిన్ (విటమిన్ B1) పొందడానికి మీ ఆహారంలో చేపలు, బీన్స్, పప్పులు , పెరుగును కూడా భాగం చేసుకోవచ్చు. 

యునైటెడ్ స్టేట్స్‌లో 19 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి విటమిన్ B1ను 1.2 మిల్లీగ్రాములు (mg) మహిళలకు 1.1 mg రోజువారీ తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags :

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com