సాక్షి లైఫ్ : రోజంతా శ్రమించి రాత్రి పడుకోబోయే సమయానికి కాళ్లలో ఏదో పాకుతున్నట్లు, లాగుతున్నట్లు అనిపిస్తుందా..? కాళ్లు ఆడిస్తే తప్ప ఉపశమనం కలగడం లేదా..? అయితే మీరు 'రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్' (RLS) అనే నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లే. దీనిని తేలికగా తీసుకోకుండా వైద్యులను సంప్రదించడం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఏమిటీ సమస్య..?
రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అనేది ఒక నరాల రుగ్మత. ఇందులో వ్యక్తి తన కాళ్లను కదిలించాలనే బలమైన కోరికను కలిగి ఉంటాడు. కాళ్లలో ఏదో పాకుతున్నట్లు (Crawling), లాగుతున్నట్లు (Pulling), లేదా విద్యుత్ షాక్ తగిలినట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ప్రధానంగా సాయంత్రం లేదా రాత్రి విశ్రాంతి తీసుకునే సమయంలో తీవ్రమవుతాయి.
ఎవరికి ముప్పు ఎక్కువ..?
కాళ్లను చాచడం, అటు ఇటు నడవడం లేదా కదిలించడం ద్వారా తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. భారతదేశంలో సుమారు 6 శాతం మంది ఈ సమస్యతో బాధ పడుతున్నట్లు అంచనా. పురుషుల కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ దీని ముప్పు పెరుగుతుంది. రక్తహీనత (Anemia), కిడ్నీ వైఫల్యం ఉన్నవారిలో, గర్భిణీలలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
ప్రధాన కారణాలు..?
శరీరంలో ఇనుము (Iron) లోపం ఈ సమస్యకు ప్రధాన కారణమని AIIMS న్యూరాలజీ విభాగం హెడ్ ప్రోఫెసర్ మంజరి త్రిపాఠి తెలిపారు. హీమోగ్లోబిన్ సాధారణంగా ఉన్నప్పటికీ, ఐరన్ నిల్వలు తగ్గితే ఈ సమస్య తలెత్తుతుంది. విటమిన్ బి12, డి లోపం, కాల్షియం తక్కువగా ఉండటం, కిడ్నీ సమస్యలు కూడా దీనికి దారితీయవచ్చు.
పరిష్కార మార్గాలు ఇవే..
వైద్య పరీక్షలు: సీరం ఫెర్రిటిన్ పరీక్ష (ఐరన్ నిల్వల పరీక్ష), విటమిన్ స్థాయిలు, కిడ్నీ పనితీరును పరీక్షించుకోవాలి. కెఫిన్ వంటివి ఎక్కువగా ఉండే కాఫీ, టీ వాడకాన్ని తగ్గించాలి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వీటిని తీసుకోకపోవడం మంచిది.
ధూమపానం, మద్యం మానుకోవాలి. క్రమం తప్పకుండా నిద్రపోయే అలవాటును అలవర్చుకోవాలి. నిరంతర నిద్రలేమి వల్ల ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా డిప్రెషన్‌కు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయవద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com