సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల యువతలోనూ క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అయితే, మనం తీసుకునే ఆహారంలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో తోడ్పడే ఐదు రకాల ఆహార పదార్థాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
1. చిలగడదుంపలు..
సాధారణ చిలగడదుంపల కంటే ఊదా రంగులో ఉండే వాటిలో 'ఆంథోసైనిన్' అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను (Inflammation) తగ్గించి, కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ముఖ్యంగా పెద్దప్రేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను ఇవి నెమ్మదింపజేస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
2. మైక్రోగ్రీన్స్..
మైక్రోగ్రీన్స్‌లో 'సల్ఫోరాఫేన్' అనే సమ్మేళనం 20 నుంచి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి, యాంటీ ఆక్సిడెంట్ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది.
3.కివీ పండ్లు..
విటమిన్-సి, ఫైబర్, పాలీఫెనాల్స్ నిలయమైన కివీ పండ్లు శరీర కణాలను రక్షిస్తాయి. ఇవి కణాల నష్టాన్ని నివారించడమే కాకుండా, దెబ్బతిన్న DNAను రిపేర్ చేసే సామర్థ్యాన్ని శరీరానికి అందిస్తాయి. అలాగే జీర్ణక్రియ మెరుగుపడటానికి ఇవి తోడ్పడతాయి.
4.గ్రీన్ టీ (Green Tea)..
గ్రీన్ టీలో ఉండే 'ఎపిగాలోకాటెచిన్-3-గాలెట్' (EGCG) అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కణితులు (Tumors) పెరగకుండా అడ్డుకుంటుంది. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగే వారిలో క్యాన్సర్ వచ్చే ముప్పు తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
5. బీన్స్..
బీన్స్ అటు ప్రోటీన్, ఇటు ఫైబర్ కలిగిన అద్భుతమైన ఆహారం. అరకప్పు బీన్స్‌లో దాదాపు 7 గ్రాముల నుంచి 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా మారి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
క్యాన్సర్ నివారణ అనేది ఏదో ఒక 'సూపర్ ఫుడ్' వల్ల సాధ్యం కాదు. ఇది నిరంతరం పాటించే అలవాట్లు, పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారం, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలను డైట్లో చేర్చుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com