Weight Loss : వేగంగా బరువు తగ్గడం ప్రమాదకరమే.. వైద్యనిపుణులు ఏమంటున్నారంటే..?

సాక్షి లైఫ్ : ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలిబ్రిటీలు వారం రోజుల్లోనే సన్నబడటం, నెల రోజుల్లోనే కిలోల కొద్దీ బరువు తగ్గడం వంటి వార్తలు చూసి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారిని అనుసరిస్తూ 'క్రాష్ డైట్స్' పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే, వేగంగా బరువు తగ్గడం అనేది ఫిట్‌నెస్ కాదు, అది అనారోగ్యానికి ఆహ్వానం పలుకుతుందని ఇండోర్‌లోని అరబిందో ఆస్పత్రి డైటీషియన్ హోమేష్ మాండవ్లియా హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

 

ఆకస్మికంగా బరువు తగ్గితే ఎదురయ్యే ముప్పులివే..

తీవ్రమైన ఆకలితోనో, ఆహారం మానేసో బరువు తగ్గడం వల్ల శరీరంలో కొవ్వుతో పాటు కీలకమైన కండర ద్రవ్యరాశి (Muscle mass) తగ్గిపోతుంది. దీనివల్ల కలిగే నష్టాలు.. శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఇనుము, కాల్షియం, విటమిన్లు అందవు. ఫలితంగా జుట్టు రాలడం, రక్తహీనత, నిరంతరం నీరసం,తలతిరగడం వంటి సమస్యలు చుట్టుముడతాయి. తరచుగా జలుబు, ఇన్ఫెక్షన్లు రావడం వల్ల శరీరం త్వరగా అనారోగ్యానికి గురవుతుంది.

 జీవక్రియ రేటు (Metabolism) పడిపోవడం వల్ల మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు మొదలవుతాయి. ఏకాగ్రత కోల్పోవడం, చిరాకు, అలసట మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

ఆరోగ్యకరంగా తగ్గడమంటే ఏంటి..?

బరువు తగ్గడం అంటే ఆహారం మానేయడం కాదు, సరైన పద్ధతిలో తినడం. ఆరోగ్యకరమైన బరువు తగ్గుదల కోసం ఈ సూత్రాలు పాటించాలి. పప్పు ధాన్యాలు, పాలు, సోయా వంటి ప్రోటీన్లతో పాటు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మీ ప్లేట్‌లో ఉండాలి.


తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. కేవలం డైటింగ్ సరిపోదు. నడక, యోగా, ఈత లేదా వెయిట్ ట్రెయినింగ్ ద్వారా కండరాలను కాపాడుకోవాలి. నిద్ర లేకపోతే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి తిరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది.


ముఖ్యంగా డయాబెటిస్, థైరాయిడ్, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు సొంత నిర్ణయాలు తీసుకోకుండా వైద్యుల లేదా డైటీషియన్ల పర్యవేక్షణలోనే డైట్ ప్లాన్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి.. ఒక్క రోజులో బరువు పెరగలేదు, అలాగే ఒక్క రోజులో తగ్గడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

 

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : weight-loss weight-lose weight-loss-tips lose-weight how-to-lose-weight
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com