పోషకాహార లోపాన్ని ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్ : కొన్ని సందర్భాల్లో మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కాపాడుకోవడానికి పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. విటమిన్ బి12, విటమిన్ "సి", విటమిన్ "డి", జింక్, అయోడిన్, ఇనుము వంటి విటమిన్లు, ఖనిజాలు తగినంతగా లభించకపోతే దీర్ఘకాలిక సమస్యలు ఏర్పడవచ్చు. వీటిలో కొన్నింటి లోపం వల్ల అలసట, మతిమరుపు, వికారం, మోకాళ్ళ నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఇది కూడా చదవండి..ఢిల్లీలో మరింత తీవ్రంగా మారిన కాలుష్య సమస్య..
ఇది కూడా చదవండి..గోరువెచ్చని నీళ్లు తాగితే వెయిట్ లాస్ అవుతారా..? నిజమేనా..?
ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?
రోగనిరోధక వ్యవస్థ..
విటమిన్ B12 లోపం నాడీ సంబంధిత సమస్యలు, చేతులు, కాళ్లు నొప్పిగా అనిపిస్తుంది. పోషకాలు సరిగా లేకపోతే ఒత్తిడి కూడా పెరుగుతుంది. విటమిన్ సి, ప్రోటీన్, రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. విటమిన్ డి లోపం మానసిక ఒత్తిడి, అలసటకు దారితీస్తుంది. అయోడిన్ లోపం మెదడు, మేధస్సు సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.
పాల ఉత్పత్తులు, ధాన్యాలలో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. ఇనుము లోపం వల్ల శరీరంలో శక్తి లేకపోవడం, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే మెగ్నీషియం లోపం వాంతులు, అలసట, ఆకలి మందగడం వంటి సమస్యలకు కారణమవుతుంది. జింక్ లోపం కారణంగా ఆకలి కోల్పోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
