ఢిల్లీలో మరింత తీవ్రంగా మారిన కాలుష్య సమస్య..  

షేర్ చేయండి:
ఢిల్లీలో మరింత తీవ్రంగా మారిన కాలుష్య సమస్య..  

సాక్షి లైఫ్ : ఢిల్లీలో కాలుష్య సమస్య మరింత తీవ్రంగా మారింది. పర్యావరణ శాఖ కొత్త నివేదిక తాజాగా వెల్లడించింది. ఢిల్లీ నగరంలో 13 పాత హాట్ స్పాట్‌లు కాకుండా, కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్న 24 కొత్త ప్రాంతాలను గుర్తించారు. ఈసారి శీతాకాలంలో కూడా కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఇది కూడా చదవండి.. గోరువెచ్చని నీళ్లు తాగితే వెయిట్ లాస్ అవుతారా..? నిజమేనా..?  

ఇది కూడా చదవండి.. పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి.. అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

ఢిల్లీలో కొత్తగా 24 హాట్‌స్పాట్‌లు..

ఢిల్లీలో కొత్తగా 24 హాట్‌స్పాట్‌లు గుర్తించారు. ఇప్పుడు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల సంఖ్య 37కు చేరింది. ఢిల్లీలో గతంలో గుర్తించిన 13 హాట్‌స్పాట్‌లు కాకుండా 24 కొత్త ప్రాంతాలను గుర్తించారు. ఐదేళ్ల క్రితం ఢిల్లీలో ఇలాంటి ప్రాంతాలు కేవలం 13మాత్రమే ఉండేవి. ఢిల్లీ కాలుష్యం రోజురోజుకి పెరుగుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ హాట్‌స్పాట్‌లలో కాలుష్యాన్ని నిరోధించడానికి ప్రతి సంవత్సరం ఎక్కువ లేదా తక్కువ, అనేక కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. 

 
కాలుష్యం ఉన్న 13 పాత హాట్ స్పాట్‌లు.. 

ఆనంద్ విహార్, అశోక్ విహార్, బవానా, ద్వారక, జహంగీర్‌పురి, ముండ్కా, నరేలా, ఓఖ్లా, పంజాబీ బాగ్, ఆర్‌కె పురం, రోహిణి, వివేక్ విహార్, వజీర్‌పూర్.

కాలుష్యం ఉన్న 24 కొత్త హాట్ స్పాట్‌లు.. 

అలీపూర్, అయానగర్, బురారీ క్రాసింగ్, సీఆర్ ఆర్ఐ మధుర రోడ్, కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్, డీటీయు, డీయు నార్త్ క్యాంపస్, ఐజిఐటీ-3, ఐహెచ్ బిఏ ఎస్, ఐటీఓ , జె ఎల్ ఎన్ స్టేడియం, లోధి రోడ్, నజఫ్‌గఢ్, నేషనల్ స్టేడియం, నెహ్రూ నగర్, న్యూ మోతీ బాగ్, ఎన్ ఎస్ యు టీ , పట్పర్‌గంజ్, పూసా (న్యూఢిల్లీ), పూసా (సెంట్రల్), షాదీపూర్, సిరిఫోర్ట్, సోనియా విహార్, శ్రీ అరబిందో మార్గ్.

ఇది కూడా చదవండి.. సున్నితమైన చర్మం కోసం ఎలాంటి ఉత్పత్తులను ఎంచుకోవాలి..?

ఇది కూడా చదవండి.. యాంటీ ఏజింగ్‌ విషయంలో మునగాకు పొడి ఎంతబాగా పనిచేస్తుందో తెలుసా..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.