Hearing Problems : వినికిడి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏమేం చేయాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చెవి ఇన్ఫెక్షన్‌ కారణంగా కొందరిలో చెవి క్యాన్సర్‌ కూడా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. చెవి ఇన్ఫెక్షన్ ఉన్న వారు వాడిన  అదే హెడ్‌ఫోన్‌ లేదా ఇయర్‌ఫోన్‌లను మరొకరు ఉపయోగిస్తే, వాళ్లు కూడా ఆ ఇన్‌ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటివి నివారించ డానికి, హెడ్‌ఫోన్‌లను తక్కువగా ఉపయోగించండి. ముఖ్యంగా ఇతరుల ఇయర్‌ఫోన్‌లను అస్సలు వాడొద్దు. అంతే కాదు, ఇయర్‌ఫోన్‌ల ద్వారా ఎక్కువ సౌండ్ వినడం వల్ల చెవుల్లోని నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కొందరు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడానికి ఇష్టపడతారు. ప్రయాణంలో ఉన్నప్పుడు, ఇంట్లో పని చేస్తున్నప్పుడు లేదా ఆఫీసులో పని చేస్తున్నప్పుడు కూడా హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఎక్కువసేపు పాటలు వింటున్నారు. ఎక్కువ సమయం వినడం వల్ల కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 

వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం.. 
 
ఎక్కువ సేపు హెడ్ ఫోన్స్ వాడటం వల్ల వినికిడి సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుందని ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి మీరు హెడ్‌ఫోన్‌లను ఉపయోగించినప్పుడు, కొంత సమయం విరామం తీసుకోండి. ఎక్కువ సేపు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటే తలలోని నరాలపై ఒత్తిడి పడుతుంది. తద్వారా వినికిడి శక్తి తగ్గుతుంది. అంతే కాదు ఇయర్‌ఫోన్‌ల రేడియేషన్, అయస్కాంత ప్రభావం కారంణంగా తలనొప్పి సమస్య మొదలవుతుంది. ఇయర్‌ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల చెవుల్లోకి గాలి ప్రవహించే అవకాశం ఉండదు. దీనివల్ల చెవి ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయి. ఇన్ఫెక్షన్ కారణంగా ఒక్కోసారి శాశ్వతంగా వినికిడి శక్తిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.  

 ఇయర్‌ఫోన్‌లను ఎక్కువ సౌండ్ తో వినడం వల్ల గుండెపై ప్రభావం పడుతుంది.. అంతే కాకుండా అనేక రకాల మానసిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. వాస్తవానికి, సాధారణ వ్యక్తి  వినికిడి సామర్థ్యం 90 డెసిబుల్స్ వరకు ఉంటుంది. కానీ ఇయర్ ఫోన్లలో అది 40 నుంచి 50 డెసిబుల్స్  పాటలు వింటున్నప్పుడు లేదా ఇయర్‌ఫోన్‌లు ఉపయోగిస్తున్నప్పుడు ఇది గమనించలేము. కానీ తరువాత వయస్సు పెరిగేకొద్దీ, దాని దుష్ప్రభావాలు వినికిడి శక్తి మీద కనిపిస్తాయి.

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

వినికిడి లోపాన్ని నిర్ధారించడానికి పరీక్షలు.. 

శారీరక పరీక్ష: డాక్టర్లు వినికిడి సమస్యకు లేదా ఇన్ఫెక్షన్ కారణాలను తెలుసుకోవడానికి చెవిలో చూస్తారు. జనరల్ స్క్రీనింగ్ టెస్టులు: వైద్యుడు చెవిలో వివిధ వాల్యూమ్‌లలో మాట్లాడే పదాలను ఎంత బాగా వింటున్నారో..?  ఇతర శబ్దాలకు మీరు ఎలా స్పందిస్తారో తనిఖీ చేస్తారు. ట్యూనింగ్ ఫోర్క్ టెస్టులు..ట్యూనింగ్ ఫోర్క్‌లు రెండు చెవుల వద్ద మెటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంచి, వాటి ద్వారా వచ్చిన శబ్దాలను గుర్తించ గలుగుతున్నారా..? లేదా అనేది పరీక్షిస్తారు డాక్టర్లు . ప్రామాణికమైన ఫోర్క్‌లతో కూడిన పరీక్షలు వినికిడి లోపాన్ని గుర్తించడంలో సహాయపడతాయి.  

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు.. 

 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.