India Ranks Top 3 Globally : వరల్డ్ లో టాప్-3 ఇండియా : విపరీతంగా పెరుగుతున్న ఫ్యాటీ లివర్ కేసులు.. 

సాక్షి లైఫ్ : భారతదేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి (Fatty liver disease) ఆందోళనకర రీతిలో పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం మద్యం తాగే వారిలోనే కనిపించే ఈ సమస్య, ఇప్పుడు జీవనశైలి మార్పుల వల్ల సామాన్యులను సైతం వేధిస్తోంది. మౌనంగా వచ్చి ప్రాణాలను హరించే 'సైలెంట్ కిల్లర్'గా భావించే ఫ్యాటీ లివర్ వ్యాధి (Fatty liver disease) దేశంలో కలకలం రేపుతోంది. ఒకప్పుడు కాలేయ వ్యాధులంటే కేవలం మద్యం సేవించే వారికే పరిమితమని భావించేవారు. కానీ, మారుతున్న ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల మద్యం అలవాటు లేని వారిలోనూ ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, ఫ్యాటీ లివర్ కేసుల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.

 

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

 

'నాన్‌-ఆల్కహాలిక్' ముప్పు..

మద్యం తాగకపోయినా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని 'నాన్‌-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్' (NAFLD) అంటారు. ప్రస్తుతం దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో శారీరక శ్రమ తగ్గడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం (Sedentary Lifestyle) ఈ వ్యాధికి ప్రధాన కారణమవుతున్నాయి.

కారణాలు ఇవే..

అధిక బరువు (Obesity)..పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు నేరుగా కాలేయంపై ప్రభావం చూపుతుంది.మధుమేహం (Diabetes)..షుగర్ వ్యాధి ఉన్న వారిలో కాలేయం ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించకపోవడం వల్ల కొవ్వు నిల్వలు పెరుగుతాయి.

జంక్ ఫుడ్.. మైదా, చక్కెర, నూనెలో వేయించిన పదార్థాలు, కూల్ డ్రింక్స్ అతిగా తీసుకోవడం వల్ల కాలేయంపై భారం పడుతోంది. నిశ్చల జీవనశైలి.. వ్యాయామం లేకపోవడం వల్ల శరీరంలోని క్యాలరీలు ఖర్చు కాక కొవ్వుగా మారి కాలేయంలో చేరుతున్నాయి.

 

కొన్ని సార్లు లక్షణాలు బయటపడకపోవచ్చు.. 

ఫ్యాటీ లివర్ (Fatty liver disease)ప్రాథమిక దశలో ఎటువంటి లక్షణాలను చూపించదు. అందుకే దీనిని 'నిశ్శబ్ద వ్యాధి' అంటారు. వ్యాధి ముదిరిన తర్వాత..విపరీతమైన అలసట, నీరసంగా అనిపించడం, కడుపులో కుడివైపు పైభాగంలో అసౌకర్యం లేదా నొప్పిగా అనిపించడం.

అంతేకాకుండా ఆకలి తగ్గడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే ఇది కాలేయ వాపు (NASH), లివర్ సిర్రోసిస్, చివరికి కాలేయ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నివారణే మార్గం.. 

 కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియంత్రణ, క్రమం తప్ప కుండా వ్యాయామం చేయడం తప్పనిసరి. ప్రతిరోజూ కనీసం 30-40 నిమిషాల నడక, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడొచ్చుని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారు ఏడాదికి ఓసారి 'లివర్ ఫంక్షన్ టెస్ట్' లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడం మేలని వారు అంటున్నారు.

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : india fatty-liver global-health-threat global-health-concern fatty-liver-disease fatty-liver-treatment how-to-cure-fatty-liver fatty-liver-diet-plan
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com