World Patient Safety Day 2026: అలర్ట్ : ఐసీయూలో పేషెంట్ వద్దకు అందరూ వెళ్లకండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మనకు తెలిసిన వారు లేదా ఆత్మీయులు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినప్పుడు, వారిని చూడటానికి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో వెళ్లడం సహజం. అయితే, అత్యవసర చికిత్స విభాగం (ICU) అనేది ఇన్ఫెక్షన్ల నియంత్రణ, పరిశుభ్రత, ప్రశాంతతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన ప్రదేశం. అక్కడికి ఒకేసారి ఎక్కువ మంది వెళ్లడం వల్ల రోగికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐసీయూలోకి సందర్శకుల రాకను ఆసుపత్రులు ఎందుకు నియంత్రిస్తాయో, దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏమిటో తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

ఐసీయూలో సందర్శకుల రద్దీ రోగికి ఎలా ముప్పుగా మారుతుంది..?

1. ఇన్ఫెక్షన్ల ప్రమాదం..

ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులకు రోగనిరోధక శక్తి (Immunity) చాలా తక్కువగా ఉంటుంది. వారి శరీరానికి వివిధ రకాల గొట్టాలు, కాథెటర్లు అమర్చి ఉంటాయి. ఇలాంటి స్థితిలో ఒకే గదిలోకి నలుగురైదుగురు రావడం వల్ల బయటి బ్యాక్టీరియా, వైరస్‌లు నేరుగా లోపలికి ప్రవేశిస్తాయి. ఐసీయూలో ఒక సందర్శకుడు పెరిగితే, రోగికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం 15 నుంచి 20శాతం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వాతావరణం బాగోలేనప్పుడు, ఫ్లూ సీజన్లలో ఆసుపత్రులు సందర్శకులను అనుమతించకపోవడానికి ఇదే ప్రధాన కారణం.

2. చేతుల ద్వారా వ్యాపించే 'సైలెంట్ ఇన్ఫెక్షన్'..

చూడటానికి మన చేతులు శుభ్రంగానే ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ వాటిలో కంటికి కనిపించని ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. చేతులు కడుక్కోకుండా రోగిని తాకడం, మంచం రెయిలింగ్స్, ఐవీ లైన్ (IV line) లేదా వెంటిలేటర్ ట్యూబ్‌లను పట్టుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపిస్తాయి (Contact Transmission). అందుకే డాక్టర్లు సైతం రోగిని తాకే ముందు, ఆ తర్వాత కనీసం 20 సెకన్ల పాటు శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకుంటారు.

3. శబ్దకాలుష్యంతో రికవరీకి ఆటంకం..

ఐసీయూలో ప్రతి యంత్రం చేసే శబ్దానికి ఒక అర్థం ఉంటుంది. దానికి తోడు సందర్శకులు పదేపదే మాట్లాడటం, ఫోన్లో గట్టిగా అరవడం లేదా రోగిని చూసి భావోద్వేగానికి గురై ఏడవడం వల్ల రోగి మెదడుపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీనివల్ల వారి రక్తపోటు (BP), గుండె స్పందన రేటు పెరిగిపోతాయి. కంటి నిండా నిద్రలేకపోవడం వల్ల 'ఐసీయూ డెలీరియం' (ICU Delirium) అనే గందరగోళ స్థితికి లోనవుతారు. విషమ పరిస్థితుల్లో ఉన్న రోగికి మందులతో పాటు నిద్ర కూడా అంతే అవసరం.

4. వైద్య సిబ్బంది విధులకు ఇబ్బంది..

ఐసీయూలో ప్రతి నిమిషం చాలా విలువైనది. అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లు, నర్సులు క్షణాల వ్యవధిలో స్పందించి ఇంజెక్షన్ ఇవ్వడం, సీపీఆర్ (CPR) చేయడం లేదా యంత్రాలను సెట్ చేయడం వంటివి చేయాలి. రోగి మంచం చుట్టూ జనం గుమిగూడి ఉంటే వైద్య బృందానికి కదలడానికి స్థలం ఉండదు. దీనివల్ల చికిత్సలో జరిగే 2-3 నిమిషాల ఆలస్యం కూడా రోగి ప్రాణాల మీదకు తీసుకురావచ్చు.

5. ప్రాణాధార యంత్రాల వైర్లు ఊడిపోయే భయం..

తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగికి వెంటిలేటర్ ట్యూబ్, మూత్ర విసర్జన గొట్టం, సెలైన్ డ్రిప్స్, మానిటర్ వైర్లు వంటివి కనీసం 8 నుంచి 10 దాకా అమర్చి ఉంటాయి. గుంపుగా ఉన్నప్పుడు పొరపాటున ఎవరి చేయి తగిలినా లేదా దుస్తులు తగిలి ఆ ట్యూబులు ఊడిపోతే, క్షణాల్లో శ్వాస ఆగిపోయే ప్రమాదం ఉంది.

కుటుంబ సభ్యులు ఏం చేయాలి మరి..?  

రోగి త్వరగా కోలుకోవాలంటే ఆత్మీయుల ప్రేమతో పాటు పరిశుభ్రత కూడా ముఖ్యమే. మీరు ఐసీయూకి వెళ్లినప్పుడు ఈ నియమాలు పాటించండి: రోగిని చూసేందుకు ఒకరిద్దరు మాత్రమే వెళ్లాలి. ఆసుపత్రి సూచించిన సమయాల్లోనే (Visiting hours) వెళ్లాలి. ఐసీయూలోకి వెళ్లే ముందు, బయటకు వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆసుపత్రి సిబ్బంది సూచించిన మాస్కులు, గౌన్లు లేదా షూ కవర్లను తప్పనిసరిగా ధరించాలి. ఐసీయూలో సాధ్యమైనంత వరకు నిశ్శబ్దం పాటించాలి. ఫోన్లను సైలెంట్‌లో ఉంచాలి. మీకు జ్వరం, జలుబు, దగ్గు లేదా మరేదైనా అంటువ్యాధి లక్షణాలు ఉంటే, దయచేసి ఐసీయూ వైపు వెళ్లకండి.

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.