EYE health : దగ్గరి చూపు.. దూరదృష్టి సమస్యలా..? కారణాలు, లక్షణాలు, పరిష్కారాలు..!

షేర్ చేయండి:
EYE health : దగ్గరి చూపు.. దూరదృష్టి సమస్యలా..? కారణాలు, లక్షణాలు, పరిష్కారాలు..!

సాక్షి లైఫ్ : నేటితరం డిజిటల్ జీవనశైలిలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య కంటి చూపు లోపాలు. గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల స్క్రీన్‌ల వైపు చూడటం వల్ల కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. దీని ఫలితంగా ‘మయోపియా’, ‘హైపర్‌మెట్రోపియా’ వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. సాధారణ భాషలో వీటిని ‘హ్రస్వదృష్టి’, ‘దీర్ఘదృష్టి’ అని అంటారు.అయితే, ఏ సమస్యకు ఎలాంటి లక్షణాలు ఉంటాయనే విషయంలో చాలామందిలో గందరగోళం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో మయోపియా, హైపర్‌మెట్రోపియా అంటే ఏమిటి? వాటి లక్షణాలు, కారణాలు, నివారణ మార్గాలను గురించి యిప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి..Hiccups : ఎక్కిళ్లతో ఇబ్బంది పడుతున్నారా..? చెక్ పెట్టే 5 అద్భుతమైన చిట్కాలు ఇవిగో..!

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

1. మయోపియా అంటే..? (హ్రస్వదృష్టి / దగ్గరి చూపు)..  

ప్రస్తుత రోజుల్లో పిల్లలు, యువతలో ఈ సమస్య విపరీతంగా కనిపిస్తోంది. మయోపియా ఉన్నవారికి దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి కానీ, దూరంగా ఉన్న వస్తువులను చూడటంలో ఇబ్బంది పడుతుంటారు. కంటి గుడ్డు (Eyeball) సాధారణ పరిమాణం కంటే కొద్దిగా పొడవుగా మారినప్పుడు లేదా కార్నియా వక్రత పెరిగినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. దీనివల్ల బయట నుండి వచ్చే కాంతి కిరణాలు రెటీనాపై కాకుండా, దానికంటే ముందే కేంద్రీకృతమవుతాయి 

 ప్రధాన లక్షణాలు..దూరంగా ఉండే బోర్డులు, టీవీ స్క్రీన్‌లు మసకగా కనిపించడం.వస్తువులను స్పష్టంగా చూడటానికి కళ్లను చిన్నవిగా చేసి చూడాల్సి రావడం.కంటి అలసట, తరచుగా వచ్చే తలనొప్పి.  

కారణాలు..డిజిటల్ స్క్రీన్‌లను అతిగా చూడటం, తక్కువ వెలుతురులో చదవడం.వంశపారంపర్య లోపాలు.శారీరక శ్రమ, బహిరంగ ఆటలు తగ్గడం. 

2. హైపర్‌మెట్రోపియా అంటే..? (దీర్ఘదృష్టి, దూరదృష్టి)..

ఈ పరిస్థితి మయోపియాకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి కానీ, దగ్గరగా ఉన్న అక్షరాలను చదవాలన్నా లేదా వస్తువులను చూడాలన్నా కళ్లు మసకబారుతుంటాయి. సాధారణంగా వయసు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కంటి గుడ్డు పరిమాణం సాధారణం కంటే చిన్నదిగా ఉండటం వల్ల లేదా కంటి లెన్స్ తన సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల కాంతి కిరణాలు రెటీనాపై కాకుండా, దాని వెనుక భాగంలో కేంద్రీకృతమవుతాయి.

ప్రధాన లక్షణాలు.. పుస్తకాలు చదువుతున్నప్పుడు లేదా మొబైల్ చూస్తున్నప్పుడు అక్షరాలు సరిగ్గా కనిపించకపోవడం.ఎక్కువసేపు దృష్టి కేంద్రీకరించడం వల్ల కళ్లలో చికాకు, నీరు కారడం.సాయంత్రం వేళల్లో తలనొప్పి తీవ్రమవడం. కారణాలు..వృద్ధాప్యం కారణంగా కంటి లెన్స్ సాగే గుణాన్ని కోల్పోవడం. పుట్టుకతోనే కంటి నిర్మాణం చిన్నదిగా ఉండటం.దృష్టి లోపాలను నివారించే మార్గాలుకంటి చూపును మెరుగుపరుచుకోవడానికి, భవిష్యత్తులో తీవ్రమైన లోపాలు రాకుండా ఉండటానికి వైద్య నిపుణులు కొన్ని ముఖ్యమైన చిట్కాలను సూచిస్తున్నారు. 

20-20-20 సూత్రం పాటించండి..కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్ ముందు పనిచేసేవారు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, కనీసం 20 సెకన్ల పాటు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. దీనివల్ల కంటి కండరాల ఒత్తిడి తగ్గుతుంది. తగినంత వెలుతురు: చీకటి గదుల్లో లేదా మొబైల్ బ్రైట్‌నెస్ ఎక్కువగా పెట్టుకుని చదవడం ఆపాలి. చదువుకునే ప్రాంతంలో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. 

ఆరుబయట ఆడుకునేలా.. 

ముఖ్యంగా పిల్లలు రోజులో కొంత సమయం ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి. సహజసిద్ధమైన సూర్యరశ్మి, పచ్చదనం కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కంటి చూపు మెరుగవ్వడానికి విటమిన్-A, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే క్యారెట్లు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు వంటి పోషకాహారాన్ని నిత్యం తీసుకోవాలి. కంటి చూపులో ఎలాంటి మార్పులు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నేత్ర వైద్యులను (Ophthalmologist) సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ సూచించిన పవర్‌ గల కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్‌లను క్రమం తప్పకుండా వాడటం ద్వారా ఈ సమస్యలను సులభంగా అదుపు చేయవచ్చు.

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..Dandruff : చుండ్రు ఉన్నప్పుడు తలకు నూనె రాయడం వల్ల సమస్య తగ్గుతుందా లేక పెరుగుతుందా..? 

ఇది కూడా చదవండి..Daily Breakfast Bread: అల్పాహారంగా మీరు రోజూ బ్రెడ్ తింటున్నారా..? ఆరోగ్యానికి అది అమృతమా.. అనర్థమా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.