Troubled by Lizards at Home : ఇంట్లో బల్లుల బెడద వేధిస్తోందా..? ఈ సింపుల్ చిట్కాలతో ఇట్టే తరిమికొట్టండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఇళ్లలో బల్లులు తిరుగుతుంటే చాలామంది భయపడు తుంటారు, అసహ్యించుకుంటారు. ముఖ్యంగా వంటగదిలో ఇవి సంచరించడం వల్ల ఆహార పదార్థాలలో పడితే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే చాలామంది వీటిని తరిమికొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ తలుపుల గుండా, కిటికీల గుండా ఇవి మళ్లీ ఇంట్లోకి ప్రవేశిస్తుంటాయి. అయితే, కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే ఇంటి నుంచి బల్లులను శాశ్వతంగా పారద్రోలవచ్చు. ఆ ప్రభావవంతమైన చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. వెల్లుల్లి, ఉల్లిపాయ రసం..

బల్లులను తరిమికొట్టడంలో ఉల్లిపాయ, వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తాయి. ముందుగా ఉల్లిపాయ, వెల్లుల్లి రసాన్ని తీసుకోవాలి. ఆ రసంలో కొద్దిగా నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో నింపి.. బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో పిచికారీ చేయాలి. వీటి వాసనకు బల్లులు ఆ ప్రాంతం వైపు కూడా రావు.

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

 

2. గుడ్డు పెంకులు.. 

ఇంట్లో బల్లులను దూరం చేయడానికి గుడ్డు పెంకులు చక్కటి ప్రత్యామ్నాయం. మనం వాడేసిన గుడ్డు పెంకులను సేకరించాలి. బల్లులు ఎక్కువగా సంచరించే మూలల్లో, తిరిగే చోట్ల ఈ పెంకులను ఉంచాలి. గుడ్డు పెంకుల వాసన, వాటి ఉనికిని చూసి బల్లులు భయపడి పారిపోతాయి.

3. మిరియాల పొడి..

బల్లుల బెడద నుంచి విముక్తి పొందడానికి మిరియాలు గ్రేట్ రెమెడీ. కొన్ని మిరియాలను తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మిరియాల పొడిని నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌లో పోయాలి. బల్లులు కనిపించే ప్రాంతాలపై ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయడం ద్వారా వాటిని సులభంగా తరిమికొట్టవచ్చు.

4. నెమలి ఈకలు..

బల్లులు నెమలి ఈకలను చూసి భయపడతాయనే విషయం మీకు తెలుసా..? ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉంటే గోడలకు నెమలి ఈకలను అలంకరించవచ్చు. లేదా ఇంటి ప్రధాన ద్వారాలు, కిటికీల పైభాగంలోనూ వీటిని అమర్చడం ద్వారా బల్లులు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు.

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.