జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ సమస్యలకు సరైన పరిష్కారాలు..   

సాక్షి లైఫ్ : జీర్ణక్రియ సరిగా లేకుంటే శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. అంతేకాకుండా మానసికపరంగా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల, జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఏమేం చేయాలి..? ఏమి చేస్తే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

 
జీర్ణక్రియను మెరుగుపరిచే మార్నింగ్ హ్యాబిట్స్..    


 మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కొన్ని అలవాట్లు మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు అవి రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో కూడా ఇవి సహాయపడతాయి. జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల గ్యాస్, అలసట వంటి అనేక శారీరక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వీటిని నివారించడానికి, కొన్ని సులభమైన, ప్రభావవంతమైన అలవాట్లు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..?  

 

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం ఏమి చేయాలి..?

గోరువెచ్చని నీటితో ప్రారంభించండి: మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది మీ జీర్ణవ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. అంతేకాదు ఇది విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

నిమ్మకాయ నీటితో రోజు ప్రారంభించండి: గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. జీర్ణ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తుంది.తేలికపాటి వ్యాయామం చేయండి : ఉదయం యోగా, స్ట్రెచింగ్ లేదా తేలికపాటి నడక అవసరం. ఇలా చేయడం వల్ల మీ జీర్ణ అవయవాలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. కడుపులో గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

మీ పొట్టను శుభ్రపరచడం అలవాటు చేసుకోండి - మీ పొట్టను శుభ్రం చేయడానికి ఉదయం ఉత్తమ సమయం. ఇందులో క్రమబద్ధతను కొనసాగించడానికి, వోట్స్, పండ్లు మొదలైన ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడంమంచిది.ఫైబర్ అధికంగా ఉండే అల్పాహారం తినండి - మీ ఉదయం అల్పాహారంలో పండ్లు, ఓట్స్, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోండి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పొట్టను తేలికగా ఉంచుతాయి.

ప్రోబయోటిక్ ఆహారాలు: పెరుగు, మజ్జిగ లేదా ఇతర ప్రోబయోటిక్ ఆహారాలు తినడం ప్రారంభించండి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణశక్తిని బలోపేతం చేస్తాయి.
తులసి లేదా అల్లం టీ తాగండి - ఖాళీ కడుపుతో తులసి లేదా అల్లం టీ గ్యాస్ , కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

అతిగా తినడం మానుకోండి - ఉదయాన్నే ఎక్కువగా తినడం మానుకోండి, ఎందుకంటే ఎక్కువ తినడం వల్ల రోజంతా బద్ధకంగా ఉంటుంది. మీకు ఏ పని చేయాలని అనిపించదు.

వేయించిన, కారంగా ఉండే ఆహారాన్ని తినడం మానుకోండి - ఉదయం లేదా రాత్రి, భోజనం లేదా అల్పాహారం, అది తేలికగా, పోషకాలతో కూడినదై ఉండాలి. వేయించిన ఆహార పదార్థాలు, తీపి పదార్థాలు జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందుకే ఉదయం పూట వీటిని తినకూడదు.

ఆహారాన్ని నెమ్మదిగా తినండి: అల్పాహారాన్ని నెమ్మదిగా తినండి.. బాగా నమలండి. తద్వారా ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఈ అలవాట్లు మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటి ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.

 

ఇది కూడా చదవండి..మెదడులో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే మార్గాలు..

ఇది కూడా చదవండి..మెదడులో రక్తం గడ్డకట్టడానికి కారణాలు..?

ఇది కూడా చదవండి..బ్రెయిన్ క్లాట్ అంటే ఏమిటి..? ఇది ప్రాణాంతకమా..?

 

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : digestive-enzymes digestive digestive-foods digestive-problems probiotics gastro-problems digestive-health-day digestive-system health-benefits-of-probiotics probiotics-for-gut-health benefits-of-probiotics probiotic-supplements probiotics-for-digestive-health digestive-health gas-problem gas-problem-in-stomach gastric-problem-solution how-to-improve-digestive-system exercise-for-gastric-problem yoga-for-gastric-problem digestive-problems-instant-relief
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com